Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ అవయవాలు దానమిచ్చింది

By:  Tupaki Desk   |   17 March 2015 10:58 AM IST
హీరోయిన్‌ అవయవాలు దానమిచ్చింది
X
అందాల పోటీల నుంచి మోడలింగ్‌ వైపు వచ్చి అట్నుంచి సినిమా నాయిక అయిన పార్వతి ఒమన్‌ కుట్టి.. తన పుట్టినరోజు వేళ అవయవ దానం ప్రకటించి నలుగురికి ఆదర్శమైంది.

అన్నదానం కంటే గొప్ప దానం ఇంకేదైనా ఉందా? అంటే అది ఒక్క అవయవ దానం మాత్రమేనని చెప్పొచ్చు. కుంటి, గుడ్డి, మూగ ఇలా అవయవాలు లేకుండా పుట్టినవారిని చూస్తే దేవుడు అన్యాయం చేశాడు అనేస్తాం. రక్తదానం, అవయవదానం వల్ల కలిగే పుణ్యం ఎక్కువే. మనం బతికి లేకపోయినా మన శరీరంలోని అవయవాలు వేరే వ్యక్తుల పేరిట భూమ్మీద బతికే ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించినట్టుంది ఆ హీరోయిన్‌.

''నా జీవితంలో అరుదైన పుట్టిన రోజు ఇది. అవయవదానం ఇవ్వడం ఎంతో ఉద్వేగాన్ని నింపింది. నేను లేకపోయినా నా మనస్సు బతికే ఉంటుంది అన్న నిజం తెలుసుకున్నా'' అని చెప్పింది పార్వతి. అన్నట్టు ఈ భామ అప్పట్లో అజిత్‌ సరసన ఓ సినిమాలో నటించింది. తర్వాత కెరీర్‌ పరంగా అనుకున్నంత పుంజుకోలేకపోయింది. ఇలా పుట్టినరోజు పార్టీలు ఇస్తూ, ఏదో ఒక సెన్సేషన్‌ చేయడం ద్వారా జనాలకు టచ్‌లో ఉంటోందన్నమాట!!