Begin typing your search above and press return to search.

అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందని చెబుతున్న బ్యూటీ..!

By:  Tupaki Desk   |   11 Jan 2023 11:30 PM GMT
అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందని చెబుతున్న బ్యూటీ..!
X
'అర్జున్ రెడ్డి' మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సంగతి అందరికీ తెల్సిందే. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ టాలీవుడ్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీతో విజయ్ దేవరకొండ యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్లో స్టార్ హీరోగా మారిపోయాడు.

అర్జున్ రెడ్డి మూవీలో శాలిని హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ హిట్టుతో శాలినీకి తెలుగులోనే ఫుల్ క్రేజ్ ఏర్పడింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్లు దక్కాయి. అయితే అర్జున్ రెడ్డి అంతటి హిట్ మాత్రం ఆ తర్వాత ఆమె అందుకోలేక పోయింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ సినిమాలపై దృష్టి సారించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తొలుత హీరోయిన్ ఆఫర్ తమిళ బ్యూటీ పార్వతి నాయర్ కు వచ్చిందని తాజాగా ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది.

'అర్జున్ రెడ్డి' సినిమాలో హీరోయిన్ అవకాశంపై పార్వతి నాయక్ మాట్లాడుతూ.. ఏ రంగంలోనైనా అదృష్టం చాలా ముఖ్యమని తెలిపింది. జీవితంలో అదృష్ట లక్ష్మి ఒక్కసారి తలుపు తడుతుందని.. అప్పుడే దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

అయితే తాను మాత్రం ఛాన్స్ మిస్ చేసుకున్నానని వాపోయింది. అర్జున్ రెడ్డిలో కథనాయికగా తాను నటించాల్సి ఉందని.. అయితే ఇందులో లిప్ లాక్.. రొమాన్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో తాను నిరాకరించినట్లు చెప్పింది.

ఈ మూవీ చూశాక ఇది ఒక అందమైన ప్రేమకథ చిత్రం అనిపించిందని వివరించింది ఈ సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు ఆ తర్వాత చాలా బాధపడినట్లు పార్వతి నాయక్ వెల్లడించింది. అయితే తన జీవితంలోకి మరోసారి అదృష్టం 'ఉత్తమ విలన్' రూపంలో వరించిందని తెలిపింది. కమల్ హాసన్ సరసన నటించే ఛాన్స్ దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది.

కమల్ హాసన్ పక్కన నటించానంటే ఇప్పటికీ తనకు నమ్మశక్యం కావడం లేదని సంతోషం వ్యక్తం చేసింది. కాగా ఒకే తరహా పాత్రలు పోషించడం తనకు నచ్చలేదని పార్వతి నాయక్ వెల్లడించింది. ఈ భామ తమిళంలో 'ఉత్తమ విలన్'.. 'మలై నేరత్తు మైకం'.. 'ఎంకిట్ట మోదాదే'.. 'నిమిర్' తదిత సినిమాల్లో నటించి హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.