Begin typing your search above and press return to search.
మెగా అల్లుడి 'కిన్నెరసాని' చిత్రం నుంచి 'పార్వతీపురం' పాట..!
By: Tupaki Desk | 28 Sep 2021 11:24 AM GMT'విజేత' సినిమాతో హీరోగా పరిచయమైన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న తాజా చిత్రం ''కిన్నెరసాని''. 'అతి సర్వత్ర వర్జయత్' అనేది దీనికి ఉప శీర్షిక. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో 'అశ్వథ్థామ' ఫేమ్ రమణ తేజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ఫస్ట్ గ్లిమ్స్ - థీమ్ ఆఫ్ కిన్నెరసాని - టీజర్ విశేష స్పందన తెచ్చుకుని.. సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. ఈ క్రమంలో తాజాగా 'పార్వతీపురం' అనే సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేసింది.
'దారి కాని దారిలోన.. ఊదు పొదలనా.. పెద్ద కొడుకు మర్రిచెట్టు.. నాకు చివరనా.. సిచ్చు కంట చెరువు గట్టు.. తూరుపున్నదే..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలకు మంచి అనుభూతిని కలిగిస్తోంది. యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ దీనికి ట్యూన్ కంపోజ్ చేశారు. లిరిసిస్ట్ కిట్టు విస్సాప్రగడ పెద్దగా వాడుకలో లేని పదాలను ఈ పాత్రకు సాహిత్యంగా సమకూర్చారు. ఉమా నేహా - రేవంత్ - ధనుంజయ సీపాన ఈ గీతాన్ని ఆలపించారు.
'పార్వతీపురం' పాట ఈ మధ్య కాలంలో వచ్చిన సాంగ్స్ లో ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ''కిన్నెరసాని'' చిత్రానికి దేశరాజ్ సాయితేజ్ కథ - స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫీ అందించగా.. అన్వర్ అలీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అన్బు అరీవ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ - శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తండ్రి కోసం ఓ యువకుడు సాగించిన అన్వేషణే 'కిన్నెరసాని' కధాంశమని తెలుస్తోంది. ఇందులో వేదా అనే పాత్రలో కళ్యాణ్ దేవ్ కనిపించనున్నాడు. రవీంద్ర విజయ్ - ఆన్ శీతల్ - మహతి బిక్షు - కాశిష్ ఖాన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విభిన్నమైన కథ కథనాలతో వస్తున్న 'కిన్నెరసాని' మెగా అల్లుడికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.