Begin typing your search above and press return to search.
పటేల్ ఎస్.ఐ.ఆర్ గా వస్తున్న జగపతి
By: Tupaki Desk | 30 March 2017 5:59 AM GMTజగపతి బాబు హీరోగానే కాదు.. కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ ఫాంలోకి వచ్చేశాడు. హీరోగా కెరీర్ తేడా వస్తున్న రోజుల్లో.. నందమూరి బాలకృష్ణ మూవీ లెజెండ్ లో విలన్ గా నటించడం జగపతి కెరీర్ ను మలుపు తిప్పేసింది. అప్పటి నుంచి సౌత్ ఇండియా మొత్తానికి ఫేవరేట్ స్టైలిష్ విలన్ గా మారిపోయాడు జేబీ.
అయితే.. ఇప్పుడీయన క్రేజ్ పీక్ స్టేజ్ లో ఉండడంతో హీరోగా కూడా జగపతిబాబుకు ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న ఈయన.. ఇప్పుడు పటేల్ ఎస్.ఐ.ఆర్. అనే మూవీకి అంగీకరించాడు. విలన్ గాను.. హీరోయిన్ ఫాదర్ గాను.. హీరో తండ్రి పాత్రల్లోను కేరక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న సమయంలో.. హీరోగా జగపతిబాబుకు ఇది రీఎంట్రీ అనాల్సిందే. అయితే.. ఈ మూవీ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండడంతోనే అంగీకరించినట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు వాసు పరిమి చెప్పిన కథ అద్భుతంగా ఉండడం.. వారాహి బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనుండడం కూడా.. జగపతి హీరోగా రీఎంట్రీకి కారణం అని చెప్పచ్చు.
తాజాగా షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రానికి.. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించనుండగా.. డీజే వసంత్ సంగీతం ఇస్తున్నాడు. రాజమౌళి కుమారుడు కార్తికేయ లైన్ ప్రొడక్షన్ వహించనుండడం ప్రత్యేక ఆకర్షణ కానుంది. టైటిల్ నుంచి ఆకర్షణీయంగా ఉండి.. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కే పటేల్ ఎస్.ఐ.ఆర్. జగపతి ఎలాంటి కనికట్టు చేయనున్నాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/