Begin typing your search above and press return to search.
పఠాన్ సెన్సార్ రిపోర్ట్.. పద్దతిగానే..
By: Tupaki Desk | 17 Jan 2023 11:30 PM GMTజీరో అనే భారీ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఖాన్... ఇప్పుడు పఠాన్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. హిందీలో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఆదిత్య చోప్రా నిర్మాతగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షారుక్ ఖాన్ ఒక రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఫీల్డ్ ఆపరేటివ్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, టీజర్లు, పాటలు ఆకట్టుకుంటున్నాయి.
జీరో సినిమా 2018లో విడుదలవగా ఆ తర్వాత షారుక్ ఖాన్ హీరోగా ఒక్క సినిమా కూడా చేయలేదు. సుమారు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఆయన జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు సుమారు ఈ సినిమాకి 250 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. రెండు గంటల 26 నిమిషాల పాటు సాగిన ఈ సినిమాకి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది.
జనవరి 20వ తేదీ నుంచి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమా అనేక ఫార్మాట్‌లలో విడుదల కాబోతోంది. ఐమాక్స్, ఫోర్‌డీఎక్స్, డీ బాక్స్, ఐసీఈ వంటి పలు ఫార్మాట్లలో సినిమాని విడుదల చేయబోతున్నారు.
అయితే బేషరం సాంగ్ రిలీజ్ అయినప్పుడు సినిమా మీద చాలా నెగెటివిటీ వచ్చింది. ఖచ్చితంగా సినిమాని అడ్డుకొని తీరుతామంటూ... హిందూ సంస్థలు పెద్ద ఎత్తున రచ్చ చేశాయి. అలాంటి సినిమాకి ఏ సర్టిఫికెట్ వస్తుందని అందరూ భావించారు. కానీ... యూఏ అంటే పెద్దల పర్యవేక్షణలో చిన్నపిల్లలు కూడా చూడవచ్చు అంటూ సర్టిఫికెట్ జారీ చేయడంతో హిందూ సంస్థలు ఈ సినిమా మీద రచ్చ చేసే అవకాశం లేకుండా పోయిందనే చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.