Begin typing your search above and press return to search.

ఆ రేస్ లో పుష్ప‌కు షాకిచ్చిన ప‌ఠాన్‌!

By:  Tupaki Desk   |   10 Jan 2023 2:30 AM GMT
ఆ రేస్ లో పుష్ప‌కు షాకిచ్చిన ప‌ఠాన్‌!
X
న్యూ ఇయ‌ర్‌.. న్యూ మూవీస్ హంగామా మొద‌లైంది. ఈ ఏడాది థియేట‌ర్ల‌లోకి ప‌లు క్రేజీ సినిమాలు సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్నాయి. సంక్రాంతితో 2023 సినిమాలు సంద‌డి జోరుగా ప్రారంభం కాబోతోంది. ఈ పోటీలో క్రేజీ సినిమాల‌తో పాటు ప‌లు పాన్ ఇండియా సినిమాలు పోటీపోటీగా రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేప‌థ్యంలో మూవీ డేటాబేస్ వేదికైన IMDB 2023లో ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాను విడుద‌ల చేసింది.

ఈ లిస్ట్ లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ న‌టిస్తున్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `ప‌ఠాన్‌` టాప్ ప్లేస్ ని ద‌క్కించుకోవ‌డం విశేషం. ఈ మూవీని ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి దీనిపై బైకాట్ ట్రెండ్ భారీ స్థాయిలో వైర‌ల్ అవుతోంది. టీజ‌ర్‌, దీప‌కా, షారుక్ ల బీచ్ సాంగ్ ట్రోలింగ్ కు గురి కావ‌డం తెలిసిందే. ప‌లు హిందూ సంస్థ‌లు, స్వామీజీలు సైతం దీప‌కా, షారుక్ ల బీచ్ సాంగ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే కాకుండా బాలీవుడ్ సీనియ‌ర్ న‌టులు సైతం విమ‌ర్శ‌లు గుప్పించ‌డం హాట్ టాపిక్ గా మారింది.

ఇన్ని అడ్డంకుల మ‌ధ్య 2023లో ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో IMDB వేదిక‌గా ప్ర‌ధ‌మ స్థానాన్ని `ప‌ఠాన్‌` మూవీ సొంతం చేసుకోవ‌డం విశేషం. విచిత్రం ఏంటంటే ఈ స్థాయిలో వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారిన `ప‌ఠాన్‌` పాన్ ఇండియా వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించిన బ‌న్నీ `పుష్ప ది రైజ్‌`కు సీక్వెల్ గా రూపొందుతున్న `పుష్ప ది రూల్‌` ని వెన‌క్కు నెట్ట‌డం గ‌మ‌నార్హం. `ప‌ఠాన్‌` త‌రువాతి స్థానంలో `పుష్ప ది రూల్‌` నిలిచింది.

స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈమూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. త్వ‌ర‌లో తాజా షెడ్యూల్ ని భారీ స్థాయిలో ప్రారంభించ‌బోతున్నారు. మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ తో పాటు సునీల్‌, క‌న్న‌డ న‌టుడు ధ‌నుంజ‌య‌, అన‌సూయ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇదిలా వుంటే 2023 IMDB జాబితాలో ప‌లు కీల‌క సినిమాలు చోటు ద‌క్కించుకున్నాయి.

షారుక్ ప‌ఠాన్, బ‌న్నీ పుష్ప 2, ప్ర‌భాస్ ఆది పురుష్‌, స‌లార్‌, కార్తీ జ‌పాన్‌, విజ‌య్ వారీసు, ఉపేంద్ర క‌బ్జ తో పాటు ప‌లు సినిమాలున్నాయి. త‌మిళం నుంచి 5, తెలుగు నుంచి మూడు.. బాలీవుడ్ సినిమాలు 67 వున్నాయి. ఈ సినిమాల్లో టాప్ పొజీష‌న్ లో మాత్రం షారుక్ `ప‌ఠాన్‌` నిల‌వ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.