Begin typing your search above and press return to search.

దీపికా ప‌దుకొణే బికినీ పై సెన్సార్ షాక్

By:  Tupaki Desk   |   29 Dec 2022 12:03 PM GMT
దీపికా ప‌దుకొణే బికినీ పై సెన్సార్ షాక్
X
`బేష‌రాం` సాంగ్ లో దీపికా ప‌దుకొణే ధ‌రించిన బికినీ దేశ శ్యాప్తంగా ఎంత‌టి దుమారం రేపిందో తెలిసిందే. ఒక్క బికినీ తో దేశాన్ని ఎలా కుదిపేయోచ్చో! దీపిక నిరూపించింది. రాజ‌కీయ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దం...అమితాబ‌చ్చ‌న్...ప్ర‌కాస్ రాజ్ లాంటి వాళ్లు దీపిక మ‌ద్ద‌తివ్వ‌డం...షార‌క్ ఖాన్ దిష్ట‌బోమ్మ‌లు ద‌గ్ధం అవ్వ‌డం.. ఇలా ఒక‌టేంటి బేష‌రాం ఒక్క క్ష‌ణం పాటు ఊపిరాడ‌కుండా చేసింది.

మ‌రోవైపు దీపిక స్కిన్ షోపై సోష‌ల్ మీడియాలో కామెంట్లు..పెళ్లైన హీరోయిన్ అలాంటి సన్నివేశాల్లో న‌టించాలా? అంటూ వ్య‌క్తిగ‌తంగానూ విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అయినా `ప‌ఠాన్` అండ్ కో మాత్రం ఎక్క‌డా కింగ‌లేదు. ఏ బేదిరింపును ప‌ట్టించుకోలేదు.

ఏ పార్టీ వ్యాఖ్య‌ల్ని ఖాత‌రు చేయ‌లేదు. షారుక్ అంత‌కంత‌కు ఆ స‌న్నివేశాల్ని హీటెక్కించాడే త‌ప్ప‌! త‌గ్గేదేలే అన్నాడు. కానీ ఇప్పుడదే షారుక్..దీపిక ల‌కు సెన్సార్ రూపంలో గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఎక్క‌డ నుంచి నరుక్కుంటూ వ‌స్తే తెగుతుందో? అక్క‌డి నుంచే వేటు వేయ‌డం మొద‌లు పెట్టిన‌ట్లు క‌నిపిస్తుంది.

సెన్సార్ బోర్డ్ నేరుగా రంగుంలోకి దిగింది. దీపిక బికినీ స‌హా పాట‌లో ఆమె అందాల‌పై చర్య తీసుకోవాలని అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. పాటలో మార్పులు చేయాలని సెన్సార్ బోర్డ్ మేకర్స్‌ని కోరింది. రిలీజ్ కి ముందే ఇలాంటి వివాదాలు మంచిది కాద‌ని..క‌చ్చితంగా సెన్సార్ నిబంధ‌ల‌ను పాటించి తీరాల‌ని ఆదేశాలిచ్చింది. దీంతో బేష‌రాం పాట‌లో మార్పులు తధ్య‌మ‌ని తెలుస్తోంది. బికినీ రంగు స‌హా..దీపిక స్కిన్ షోని బ్ల‌ర్ చేయ‌నున్నారు.

మ‌రి సెన్సార్ అభ్యంత‌రం మేర‌కు ఆ పాట‌లో మార్పులు చేస్తారా? లేక పూర్తిగా పాట‌నే తొల‌గిస్తారా? అన్న‌ది చూడాలి. కార‌ణాలేమైనా మ‌ళ్లీ రీ_షూట్ అయితే త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి సిద్దార్ధ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. యాష్ రాజ్ ఫిలింస్ భారీ బ‌డ్జెట్ తో ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ ని నిర్మిస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.