Begin typing your search above and press return to search.

50 వేల ఫ్యాన్స్ కోసం పఠాన్ స్పెషల్

By:  Tupaki Desk   |   14 Jan 2023 5:31 AM GMT
50 వేల ఫ్యాన్స్ కోసం పఠాన్ స్పెషల్
X
షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్ద్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ తో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం పఠాన్. ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ మూవీ సాంగ్స్ తో వివాదాస్పదంగా మారింది. హిందుత్వ మనోభావాలు కించపరిచే విధంగా హీరో, హీరోయిన్ వస్త్రధారణ బేషారమ్ రంగ్ సాంగ్ లో ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

పెద్ద ఎత్తున బ్యాన్ పఠాన్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ లతో హడావిడి సృష్టించారు. అయితే సెన్సార్ బోర్డు కూడా ఈ సాంగ్ పై అభ్యంతరం వ్యక్తం చేయడంతో చిత్ర దర్శకుడు కాస్తా వెనక్కి తగ్గాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రా ఏజెంట్ గా షారుఖ్ ఖాన్ కనిపించబోతున్నాడు. విపరీతమైన దేశభక్తి ఉన్న యువకుడిగా భారత్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే కాప్ గా అతను కనిపిస్తున్నాడు.

ఈ ట్రైలర్ తర్వాత సినిమాపై కొంత పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. సుదీర్ఘ గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్ అభిమానులు కూడా ఈ మూవీపై అంచనాలు పెంచుకున్నారు. బాలీవుడ్ ఫేట్ ని పఠాన్ మారుస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.

యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎఫ్డీఎఫ్ఎస స్క్రీనింగ్ కోసం ఏకంగా 50 వేల మంది ఫ్యాన్స్ పఠాన్ సినిమాని చూసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ ఇండస్ట్రీలో రిలీజ్ కి ముందే ఇంతమంది కోసం స్క్రీనింగ్ చేయడం మొదటి సారి అని చెప్పాలి.

పఠాన్ మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యి ప్రేక్షకులకి బలంగా పంపించడం కోసం ఈ ఫ్యాన్స్ షోని వేయాలని షారుక్ తో పాటు చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో బ్యాన్ పఠాన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న నేపధ్యంలో ముందస్తుగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కాకుండా ఈ రకమైన ప్లాన్ తో చిత్ర నిర్మాతలు జనవరి 25న పఠాన్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.