Begin typing your search above and press return to search.

ప్ర‌తీ డ‌బ్బింగ్ మూవీ 'కాంతార‌' అవుతుందా?

By:  Tupaki Desk   |   16 Dec 2022 9:11 AM GMT
ప్ర‌తీ డ‌బ్బింగ్ మూవీ కాంతార‌ అవుతుందా?
X
ఈ మ‌ధ్య కాలంలో రిలీజైన డ‌బ్బింగ్ సినిమాల్లో క‌న్న‌డ మూవీ 'కాంతార‌' ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. రిష‌బ్ శెట్టి హీరోగా, ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కించిన ఈ సినిమా తెలుగు నాట విజ‌య దుంధుభి మోగించింది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది. 'కేజీఎఫ్‌' మేక‌ర్స హోంబ‌లే ఫిలింస్ వారు నిర్మించిన ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

ఈ మూవీ సాధించిన వ‌సూళ్ల‌ని దృష్టిలో పెట్టుకుని ప‌లువురు టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ ఇప్పుడు డ‌బ్బింగ్ సినిమాల వెంట ప‌డుతున్నారు. తాము కూడా 'కాంతార‌' త‌రహా విజ‌యాన్ని ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 'కాంతార‌'కు ద‌గ్గ‌ర‌గా పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో సాగే సినిమాల‌ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మాత సీహెచ్. సుధాక‌ర్ బాబు మ‌ల‌యాళ మూవీ 'ప‌తోన్ పాత‌మ్ నూట్టండు'ని తెలుగులో 'పులి' పేరుతో రిలీజ్ చేయ‌బోతున్నారు.

మాలీవుడ్ సీనియ‌ర్ సూప‌ర్ స్టార్స్ మోహ‌న్ లాల్‌, మ‌మ్ముట్టి వాయిస్ ఓవ‌ర్ అందిస్తూ స్టోరీని నెరేట్ చేశారు. సిజు విల్స‌న్‌, 'అల్లూరి' ఫేమ్ క‌యాదు లోహ‌ర్ హీరోయిన్ గా న‌టించింది. 19 వ శ‌తాబ్దం నేప‌థ్యంలో స‌పాగే క‌థ‌గా ఈ మూవీని రూపొందించారు.విన‌య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ పీరియాడిక్ డ్రామాని సెప్టెంబ‌ర్ 8న మ‌ల‌యాళంలో రిలీజ్ చేశారు.

అక్క‌డ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని తెలుగులో 'పులి' పేరుతో రిలీజ్ చేయ‌బోతున్నారు. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా మ‌ల‌యాళంలో కేవ‌లం రూ. 8 కోట్ల‌ని మాత్ర‌మే రాబ‌ట్ట‌గ‌లిగింది. ట్రావెన్ కోర్ కింగ్ డ‌మ్ నేప‌థ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఆనాటి ఆర‌ట్టుపుల వేలాయుధ ఫ‌నిక‌ర్ అగ్ర‌వ‌ర్ణాల‌తో పాటు బ్రిటీష్ పాల‌కుల‌పై ఎలాంటి తిరుగుబాటు చేశాడ‌నే అంశాన్ని ఇందులో చ‌ర్చించారు.

క‌థ మొత్తం మ‌ల‌యాళ నేటివిటీ నేప‌థ్యంలో సాగుతుంది. తెలుగు వాస‌న మ‌చ్చుకైనా క‌న‌ప‌డ‌దు. అక్క‌డైతే ఒకే కానీ తెలుగు వాతావ‌ర‌ణానికి మాత్రం ఈ మూవీ పెద్ద‌గా ఎక్క‌దు. ఇవ‌న్నీ తెలిసి కూడా ఈ సినిమాతో మేక‌ర్స్ 'కాంతార‌' మ్యాజిక్ ని రిపీట్ చేయాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు.

బోల్డ్ కంటెంట్ చాలా వ‌ర‌కు వున్న ఈ మూవీ న‌వంబ‌ర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో తెలుగులో 'పులి' వ‌ర్క‌వుట్ కావ‌డం క‌ష్ట‌మ‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.