Begin typing your search above and press return to search.

శ‌త్రువుల్ని సైతం మిత్రుల్ని చేసిన మెగాస్టార్ స‌హ‌నం!

By:  Tupaki Desk   |   15 Oct 2022 5:11 AM GMT
శ‌త్రువుల్ని సైతం మిత్రుల్ని చేసిన మెగాస్టార్ స‌హ‌నం!
X
మెగాస్టార్ చిరంజీవి స‌హ‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న‌పై ఎలాంటి విమ‌ర్శ‌లొచ్చినా...ప్ర‌త్యర్ధులు ఎలాంటి ఆరోప‌ణ‌లు గుప్పించినా.. దూషించినా...ఆవేషంలో నోరుజారినా మెగాస్టార్ మాత్రం ఒక్క మాట కూడా తిరిగి అన‌రు. అన్నింటికి కాల‌మే స‌మాధానం చెబుతుంది. మ‌నం త‌ప్పు చేయ‌న‌ప్పుడు ఎందుకు భ‌య‌పడాలి? ఆవేశ ప‌డి ఎవ‌రో ఏదో అన్నార‌ని వెంట‌నే స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌నే మృది స్వభావి గ‌ల వారు.

అన్నింటికీ ఆయ‌న మౌన‌మే ఓ స‌మాధానంగా భావించే గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న మ‌నిషి. అందుకే చిరంజీవి లాంటి వ్య‌క్తి కుళ్లిపోయిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో ఇమ‌డ‌లేక‌పోయార‌ని నిపుణులు సైతం అత‌ని ఔన్న‌త్యాన్ని ఎంతో గొప్ప‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. తాజాగా ఇదే విష‌యంపై మెగాస్టార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కొత్త‌లో త‌న‌పై కొంద‌రు అభియోగాలు మోపార‌ని.. అయినా ఏనాడు కోప‌గించుకోలేద‌ని..ఎంతో స‌మ‌య‌మ‌నంతో ఉన్నాన‌ని.. అందుల్లే నిజాలు నిల‌క‌డ మీద తెలిసాయ‌ని అన్నారు.

బ్ల‌డ్ బ్యాక్ విష‌యంలో భూ క‌బ్జాల‌కు పాల్ప‌డ్డాన‌ని ఆరోప‌ణ‌లు చేసిన‌ప్పుడు కూడా నేను స్పందించ‌లేదు. ఎందుకంటే నిజంగా అలాంటి ప‌నులు చేసే వాళ్లు భ‌య‌ప‌డాలి. నేను నిజాయితీగా ఉన్నాను కాబ‌ట్టే ఆ త‌ర్వాత నిజాలు వాటంత‌ట‌వే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. నాపై ఆనాడు ఆరోప‌ణ‌లు చేసి శ‌త్రువులుగా ఉన్న‌వారు నేడు నాకు మిత్రులు అయిపోయారు అని తెలిపారు.

అలాంటి రాజ‌కీయ స్నేహితులు చాలా మందే ఉన్నారు. చిరంజీవి రాజ‌కీయాల‌ నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నంత కాలం ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన వారంతా త‌ర్వాత వారంత‌ట వారే దిగొచ్చి చిరుని క్ష‌మాప‌ణ‌లు కోరిన వారు ఉన్నారు. ఇక ఇండ‌స్ర్టీలో కూడా చిరంజీవిని ప‌నిగ్గుటుకుని విమ‌ర్శించే వాళ్లు కొంత మంది ఉన్నారు.

వాళ్లు అవ‌స‌రం మేర విమ‌ర్శించిడం ..ఆ త‌ర్వాత క్ష‌మించ‌మ‌ని అడ‌గ‌డం ప‌రిపాటిగా జ‌రిగేదే. ఇటీవ‌లే అవ‌ధాని..ప్ర‌వ‌చ‌నా క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు నోరు జారి అబాసు పాలైన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత రియ‌లైజ్ చిరంజీవికి క్ష‌మాప‌ణ‌లు కూడా తెలియ‌జేసారు. అదే పెద్దాయ‌న్ని చిరంజీవి ఓ గురువు గా భావించి అత‌ని వ్య‌క్తిత్వాన్ని మ‌రోసారి చాటుకున్నారు. ద‌టీజ్ మెగాస్టార్.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.