Begin typing your search above and press return to search.

మ‌గువ‌ల‌పై ఆకృత్యం...UNICEF అంబాసిడర్ పీసీ ఫైర్

By:  Tupaki Desk   |   8 Oct 2022 5:02 AM GMT
మ‌గువ‌ల‌పై ఆకృత్యం...UNICEF అంబాసిడర్ పీసీ ఫైర్
X
ఇరాన్ లో అమాయ‌క యువ‌తులపై దాష్ఠీకం బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలు భ‌యాల‌ను పెంచుతున్నాయి. ఇటీవ‌ల‌ 22 ఏళ్ల బాలిక మహ్సా అమిని మరణం ఇరాన్ వంటి దేశాల్లో స్త్రీలు ఎదుర్కొంటున్న హింసను ప్ర‌తిబింబించింది. ఈ ఘ‌ట‌న అనంత‌రం మహిళల గైడెన్స్ పెట్రోల్ (ఇరానియన్ నైతికత పోలీసు)కి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్య‌క్త‌మైంది.

తాజాగా గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్ ప్రియాంక చోప్రా ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన బర్నింగ్ ఇష్యూకి మద్దతుగా నిలిచింది.UNICEF అంబాసిడర్ గా ఉన్న బాలీవుడ్-అమెరికన్ నటి ప్రియాంక చోప్రా జోనాస్ తన మద్దతును అందిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేసారు. ఈ పోస్ట్ లో హక్కుల కోసం పోరాడుతున్న ఇరాన్ మహిళల గొంతులను వినాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న‌ ప్రజలను ప్రియాంక చోప్రా అభ్యర్థించింది. పీసీ సంపూర్ణంగా ఇరానియన్ మహిళలకు మద్దతుగా నిలిచారు.

ప్రియాంక చోప్రా షేర్ చేసిన తాజా పోస్ట్ సారాంశం ఇలా ఉంది. "ఇరాన్ మ‌హిళ‌ల కోసం ప్రపంచవ్యాప్తంగా మహిళలు మద్ధతుగా నిలబడి గొంతెత్తుతున్నారు. బహిరంగంగా త‌మ శిరోజాల‌ను కత్తిరించుకుంటున్నారు. అనేక ఇతర రూపాల్లో తన యువ జీవితాన్ని చాలా క్రూరంగా హరించిన ఇరానీల‌కు వ్య‌తిరేకంగా నిలిచారు. ఆమె హిజాబ్ 'సక్రమంగా' ధరించనందుకు ఇరాన్ మోరాలిటీ పోలీసులు ఇలా చేసారు. యుగయుగాల బలవంతపు మౌనం తర్వాత మాట్లాడే స్వరాలు అగ్నిపర్వతంలా పేలతాయి! అవి ఆగవు.. మీ ధైర్యానికి నేను విస్మయం చెందాను. పితృస్వామ్య స్థాపనను సవాలు చేయడం ... మీ హక్కుల కోసం పోరాడడం మీ ప్రాణాలను పణంగా పెట్టడం సులభం కాదు. కానీ మీరు ధైర్యవంతులు. మీ ఖర్చుతో సంబంధం లేకుండా ప్రతిరోజూ నిర‌స‌న‌లు చేస్తున్నారు" అని పీసీ అన్నారు.

"ఈ ఉద్యమం శాశ్వత ప్రభావాన్ని కలిగి ఉండేలా చూడ‌టానికి మనం వారి పిలుపును వినాలి. సమస్యలను అర్థం చేసుకోవాలి. సామూహిక స్వరాలతో అంద‌రూ చేరాలి. ఇతరులను ప్రభావితం చేయగల ప్రతి ఒక్కరిని చేరేలా మనం తప్పక నిన‌దించాలి" అని బ‌హిరంగ పిలుపును ఇచ్చారు. "ఈ క్లిష్టమైన‌ ఉద్యమానికి మీ వాయిస్ ని జోడించండి. సమాచారంతో ఉండండి. స్వరం వినిపించండి. ఈ స్వరాలు ఇకపై నిశ్శబ్దంగా ఉండవ‌ని చెప్పండి. నేను మీతో నిలబడతాను" అని అన్నారు. జిన్,.. జియాన్,.. ఆజాదీ... మహిళలు,.. జీవితం,.. స్వేచ్ఛ. #మహ్సాఅమిని #ఇరాన్ #ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ .. అనే హ్యాష్ ట్యాగుల‌ను పీసీ ఉప‌యోగించారు.

ఈ వారం ప్రారంభంలో మరొక పోస్ట్ లో ప్రియాంక చోప్రా జోనాస్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తో క‌లిసి పోజులిచ్చారు. ఆమె అమెరికన్ మహిళలను క‌మ‌లా హారిస్ కి ఓటు వేయమని కోరింది. వారి ఓట్లను వినియోగించుకునే హక్కులను అర్థం చేసుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ప్రియాంక చోప్రా చివరిసారిగా 'మ్యాట్రిక్స్ 4'లో కనిపించింది. తర్వాత రస్సో బ్రదర్ తదుప‌రి వెబ్ సిరీస్ 'సిటాడెల్‌'లో కనిపిస్తుంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమ‌వుతుంది. త‌దుప‌రి 'ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మి'.. ఫర్హాన్ అక్తర్ 'జీ లే జరా' చిత్రాల్లో పీసీ న‌టిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.