Begin typing your search above and press return to search.
పెళ్లయితే సినిమాకి పెటాకులేనా!!
By: Tupaki Desk | 14 Nov 2017 5:30 PM GMTసినిమా తారల కెరీర్ లో పెళ్లి చాలా కీలకమైన పాయింట్. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే.. కెరీర్ ను మలుపు తిప్పే కీలకమైన పాయింట్. పెళ్లయింది అంటే.. అందాల భామల కెరీర్ ముగిసిపోయినట్లే. కొన్నేళ్ల పాటు సైలెంట్ గా ఉండి.. ఆ తర్వాత అక్క.. అమ్మ పాత్రలు చేసుకోవాల్సిందే అన్నది టాలీవుడ్ లో ఉన్న మైండ్ సెట్.
ఇప్పుడు సమంత హీరోయిన్ గా కంటిన్యూ అవుతానని చెబుుతున్నా.. ఆమెకు ఆఫర్స్ ఇచ్చే వాళ్ల సంఖ్య ఎంత ఉంటుందనే సంగతి చూడాలి. రామ్ చరణ్ రంగస్థలం రిలీజ్ అయ్యాక.. వచ్చే రెస్పాన్స్ ను బట్టే ఆమెకు ఆఫర్స్ అందుతాయని చెప్పవచ్చు. పావని గంగిరెడ్డి అంటూ ఓ టాలీవుడ్ భామ ఉంది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాలలో మెప్పించింది. రాహుల్ రవీంద్రన్ హీరోగా రూపొందుతున్న దృష్టి మూవీలో ఈమెకు హీరోయిన్ ఆఫర్ వస్తే.. తెగ ఆశ్చర్యపోయి.. ఇంతకీ తనకు పెళ్లయిందని హీరోకు తెలుసా అని అడిగేసింది.
సహజంగా ఓ హీరోయిన్ కి పెళ్లి అనగానే.. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా కంటిన్యూ అవుతారా అనే క్వశ్చన్ కు వంద సార్లు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఏ హీరోకు ఇలాంటి సమస్య ఎదురుకాదు. నిజానికి పాత కాలం హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా లీడ్ రోల్ లో సినిమాలు చేశారు. కానీ హీరోయిన్స్ కు గ్లామర్ యాంగిల్ లోకి టర్నవుట్ అయ్యాక.. పెళ్లికి కెరీర్ కి లింక్ వచ్చేసింది. పెళ్లయితే.. ఇక పద్ధతిగా నటించాల్సిందే అనే ఫీలింగ్ ఇందుకు కారణం.
కానీ బాలీవుడ్ లో పెళ్లయినా హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న వారు ఉన్నారు. ఐశ్వర్య.. కరీనా వంటి వారు ఎగ్జాంపుల్స్. కానీ మన దగ్గర మాత్రం.. అనుష్క.. కాజల్.. త్రిష.. వంటి వారు ఏజ్ పెరుగుతున్నా పెళ్లి జోలికి పోవడం లేదు. ఇందుకు కారణం.. అక్కడితో కెరీర్ కు ఫుల్ స్టాప్ పడిపోతుందనే. మరి పెళ్లికి-కెరీర్ కి హీరోయిన్స్ కి మాత్రమే లింక్ పెట్టే ట్రెండ్ ఎప్పటికి మారుతుందో చూడాలి.