Begin typing your search above and press return to search.
పోలీసులను ఆశ్రయించిన పవిత్ర లోకేశ్..
By: Tupaki Desk | 4 July 2022 2:16 PM GMTటాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ - పవిత్రా లోకేష్ మధ్య సంబంధం గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని.. పెళ్లి చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. ఇటీవల నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి తెరపైకి వచ్చి బెంగుళూరులో ఇంటర్వ్యూలు ఇవ్వడంతో.. నరేశ్ - పవిత్ర జంట నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.
ముఖ్యంగా కన్నడ మీడియాలో పవిత్ర లోకేష్ బంధం గురించి అనేక కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు మీడియా ప్రతినిధులు తనను వెంబడిస్తున్నారని పవిత్ర మైసూరులోని వీవీ పురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని.. తన మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని సీనియర్ నటి పోలీసులకు తెలిపింది.
ఇంతకముందు సోషల్ మీడియాలో తన పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని పవిత్ర లోకేశ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే.
ఇకపోతే రమ్య రఘుపతి చేసిన ఆరోపణలపై రీసెంట్ గా పవిత్ర లోకేష్ స్పందించింది. నరేష్ మూడో భార్య అని చెప్పే ఒకావిడ తనను బ్యాడ్ చేయడానికే కన్నడ మీడియాలో మాట్లాడిందని.. ఇది తన మనసును ఎంతగానే బాధపెట్టిందన్నారు పవిత్ర. ఈ విషయంలో తనకు నరేష్ కు అభిమానుల మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.
ఇక రమ్య రఘుపతి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని.. బెంగళూర్ లోని బ్లాక్ మెయిల్ ఛానల్ తో కలసి తనపై వదంతులు సృష్టిస్తుందని నరేష్ చెప్పారు. డబ్బు కోసమే రమ్య బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టిందని.. ఒకప్పుడు హైదరాబాద్ లో ఇలాగే చేసిందని ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా ఈ వ్యవహారం మొదలుపెట్టిందన్నారు.
ఇదిలా ఉంటే నరేష్ - పవిత్రా లోకేష్ మైసూర్ లోని ఓ హోటల్ లో ఉండటంతో.. నరేష్ మూడో భార్య రమ్య అక్కడి వెళ్లి వారితో వాగ్వాదానికి దిగింది. ఈ సందర్భంగా పవిత్ర పై దాడి చేసేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
రమ్యను చూసి నరేష్ విజిల్స్ వేసుకుంటూ పవిత్రతో కలిసి కారులో వెళ్లిపోయే ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పవిత్ర తనను వెంబడిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. చిలికి చిలికి గాలివానలా మారుతున్న ఈ వ్యవహారానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.