Begin typing your search above and press return to search.

పోలీస్ గ‌డ‌ప తొక్కిన పవిత్ర లోకేష్- న‌రేష్

By:  Tupaki Desk   |   26 Nov 2022 4:21 PM GMT
పోలీస్ గ‌డ‌ప తొక్కిన పవిత్ర లోకేష్- న‌రేష్
X
ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ తనపై అసభ్యకరమైన పోస్ట్ లు పెడుతూ వేధిస్తున్నార‌ని.. తన పేరు ప్ర‌తిష్ఠ‌ల‌ను దిగజార్చుతున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియా ట్రోల‌ర్లు.. యూట్యూబ్ ఛానెల్స్ పై ఫిర్యాదు చేసారు. పవిత్రా లోకేష్ శనివారం హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులతో సమావేశమై స‌ద‌రు మీడియా సంస్థలు - సోషల్ మీడియా హ్యాండిల్స్ పై చర్యలు తీసుకోవాలని అభ్య‌ర్థించారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేసిన స‌ద‌రు ఛానెల్ ల లింక్ లు.. సోషల్ మీడియా పేజీల లింక్ లను కూడా పోలీసుల‌కు అంద‌జేసారు.

నటుడు నరేష్ తో పవిత్రా లోకేష్ కి ఉన్న సంబంధం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ .. పవిత్రా లోకేశ్ చాలా సన్నిహితులుగా మారారని క‌థ‌నాలొస్తున్నాయి. తరచుగా ఈ జంట బహిరంగంగా కలిసి కనిపిస్తున్నారు.

పవిత్ర- నరేష్ లు పెళ్లి చేసుకోబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఆ తర్వాత మీడియాలో.. సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌.. ఊహాజనిత కథనాలు హల్ చల్‌ చేయడం ప్రారంభించాయి. కల్పిత ఊహాజనిత వార్తల ఆధారంగా ట్రోలింగ్ ను ఆపాలని 43 ఏళ్ల నటి ప‌విత్ర నెటిజ‌నుల‌ను కోరారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

బెంగ‌ళూరు ఘ‌ట‌న దీనికి ఆద్యం:

కొన్ని నెలల క్రితం బెంగుళూరులో జరిగిన హోటల్ సంఘటన అనంత‌రం అనేక యూట్యూబ్ ఛానెల్ లు వెబ్ సైట్ లు టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేష్ - పవిత్రా లోకేష్ మధ్య ఉన్న సంబంధాలపై పుకార్లు వ్యాప్తి చేస్తున్నాయి. ప్రముఖ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మెంబర్ అయిన నరేష్ దీనిపై ప‌విత్ర‌తో క‌లిసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసారు. తమపై తప్పుడు ప్రచారం చేసినందుకు నేరస్తులపై చర్యలు తీసుకోవాలని కూడా ఈ ఫిర్యాదులో కోరారు.

తన మూడో భార్య రమ్య రఘుపతి తప్పుడు ఆరోపణలు చేస్తోందని జూలైలో నరేష్ ఆరోపించారు. నరేష్.. నటి పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం వెనుక ఆమె హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

''దయచేసి పవిత్ర లోకేష్ ని ఇష్యూలోకి లాగొద్దు.. పవిత్రతో కలిసి జీవించడానికి నేను రమ్యకి విడాకులు ఇవ్వడం లేదు.. మేం ఎలాంటి తప్పు చేయలేదు.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. నా మనస్సాక్షితో స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేను దేవుడికి భయపడుతున్నాను... డెవిల్ కి కాదు'' అని అతను ఆ సమయంలో చెప్పాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.