Begin typing your search above and press return to search.
నరేశ్ మూడో భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పవిత్ర లోకేశ్..!
By: Tupaki Desk | 28 Nov 2022 3:21 PM GMTసీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ మరియు నటి పవిత్రా లోకేష్ మధ్య సంబంధం గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేశాయి. ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళైనట్లు ఆ మధ్య కన్నడ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి.
ఇటీవల పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. తనని టార్గెట్ గా చేసుకుంటూ పలు వెబ్ సైట్స్ - యూట్యూబ్ ఛానెళ్లు అభ్యంతరకర వీడియోలు పోస్టులు పెడుతున్నారని.. ట్రోల్స్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. అయితే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై కూడా పవిత్ర ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
నరేష్ భార్య రమ్య తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసేందుకు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ను ఉపయోగిస్తోందని పవిత్ర ఫిర్యాదులో పేర్కొంది. తమపై అసభ్యకర, అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ల వెనుక రమ్య రఘుపతి ఉన్నట్లుగా పవిత్రా లోకేష్ అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
పవిత్ర లోకేశ్ తన ఫిర్యాదులో రామారావు - శివకుమారి - రమ్య రఘుపతి వంటి ముగ్గురి పేర్లను పొందుపరిచినట్లు తెలిసింది. ప్రస్తుతానికి రమ్యను విచారణకు పిలవలేదని.. అవసరమైతే ఆమెను కూడా విచారిస్తామని పోలీసులు పేర్కొన్నారు. అలానే 15 యూట్యూబ్ ఛానెల్స్ - వెబ్ సైట్స్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ అంతిమ సంస్కారాల్లో తనను మరియు నరేష్ ను టార్గెట్ చేస్తూ అగ్లీ థంబ్ నెయిల్స్ ఉపయోగించిన యూట్యూబ్ చానల్స్ పై కూడా పవిత్ర ఫిర్యాదు చేసింది. అంత్యక్రియల సమయంలో మహేష్ తనను మరియు నరేష్ ను మందలించినట్లు ఉన్న థంబ్ నెయిల్స్ పై స్పందిస్తూ.. అలాంటిదేమీ జరగలేదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఆ యూట్యూబ్ ఛానెల్స్ మరియు సోషల్ మీడియా పేజీలు వెనుక నరేష్ భార్య రమ్య ఉందని పవిత్ర ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో పోలీసులు నోటీసులు జారీ చేసిన యూట్యూబ్ ఛానెల్స్ పై త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని భావిస్తున్నారు.
కాగా, సీనియర్ నటుడైన నరేష్ మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకోగా.. అందులో రమ్య రఘుపతి ఆయనకు మూడో భార్య. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరి కుమార్తె అయిన రమ్య ను 2010లో పెళ్లి చేసుకున్నారు నరేష్. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో ఎనిమిదేళ్లుగా ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు.
అయితే రమ్య రఘుపతి బెంగుళూరులో ప్రెస్ మీట్ పెట్టి తమకు ఇంకా విడాకులు మంజూరు కాలేదని తెలిపింది. ఈ క్రమంలో నరేశ్ - పవిత్ర సంబంధంపై కీలక వ్యాఖ్యలు చేసింది. నరేశ్ సైతం రమ్యకి మరొకరితో ఎఫైర్ ఉన్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. రమ్య బెంగళూర్ లోని బ్లాక్ మెయిల్ ఛానల్ తో కలసి తనపై వదంతులు సృష్టిస్తుందని.. డబ్బు కోసమే బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టిందని.. గతంలోనూ ఇలాగే చేసిందని నరేశ్ పేర్కొన్నారు. అప్పటి నుంచి వీరి మధ్య వివాదం కొనసాగుతుండగా.. ఇప్పుడు పవిత్ర లోకేశ్ ఫిర్యాదుతో మరోసారి వార్తల్లో నిలిచింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.