Begin typing your search above and press return to search.

పవిత్ర సినీ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందా..?

By:  Tupaki Desk   |   6 July 2022 4:30 AM GMT
పవిత్ర సినీ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందా..?
X
కన్నడలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి చెందిన పవిత్ర లోకేష్.. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. తెలుగు తమిళ కన్నడ భాషల్లో అవకాశాలు అందిపుచ్చుకుంది. మంచి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న పవిత్ర.. ప్రస్తుతం సౌత్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ గా రాణిస్తోంది. అయితే ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితంపై పలు రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో.. సినీ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్చలు జరుగుతున్నాయి.

పవిత్ర లోకేశ్ టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేష్ తో సహజీవనం చేస్తోందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఎక్కడికైనా ఇద్దరూ కలిసే వెళ్లడం.. ఇటీవల మహాబలేశ్వర్ లో ఒక స్వామిజీని దర్శించుకోవడంతో వీరి వ్యవహారంపై రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నటీనటులిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు రావడం హాట్ టాపిక్ అయింది. ఇందులో నరేష్ మూడో భార్య రమ్య ఎంట్రీతో ఈ వివాదం మరింత ముదిరింది.

పవిత్ర లోకేష్ మాత్రం తనను బ్యాడ్ చేయడానికే నరేశ్ మూడో భార్యనని చెప్పుకునే రమ్య రఘుపతి ఇలాంటి ఆరోపణలు చేస్తోందని తెలిపింది. అందుకే బెంగుళూరులో ప్రెస్ మీట్ పెట్టి తన పరువుకి భంగం కలిగించే ప్రయత్నం చేస్తోందని చెప్పింది. ఈ విషయంలో తనని, నరేష్ ని అందరూ సపోర్ట్ చేయాలని కోరింది పవిత్ర.

అయితే మైసూర్ లోని ఓ హోటల్ గదిలో నరేశ్ - పవిత్ర కలిసి ఉండటం.. మీడియా సమక్షంలో రమ్య రఘుపతి వీరిద్దరితో వాగ్వాదం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. నరేశ్ తో పవిత్ర హోటల్ గదిలో కనిపించడంపై ఇండస్ట్రీలో పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంతో ఆమె కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.

తెలుగులో స్టార్ హీరోహీరోయిన్లకు తల్లి లేదా అత్త పాత్రల్లో పవిత్ర లోకేష్ బాగా పాపులర్ అయ్యారు. అయితే తాజాగా ఆమెకు టాలీవుడ్ లో ఊహించని షాక్ తగిలినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వార్తల్లో నిలిచిన ఇష్యూ కారణంగా పవిత్రతో తల్లి పాత్రలు చేయించడానికి మేకర్స్ వెనకడుగు వేస్తున్నారట.

ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి పాత్రల్లో ఆమెను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆలోచిస్తున్నారట. ఈ నేపథ్యంలో పవిత్ర లోకేష్ తెలుగులో రెండు పెద్ద చిత్రాల్లో నటించే అవకాశం కోల్పోయినట్లు రూమర్స్ వస్తున్నాయి.

ఇకపోతే పవిత్ర లోకేశ్ ఓ సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకొని కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సుచేంద్ర ప్రసాద్‌ ని వివాహం చేసుకుంది. అయితే వీరిద్దరూ అధికారికంగా పెళ్లి చేసుకోలేదని.. లివ్-ఇన్-రిలేషన్‌ షిప్ లో మాత్రమే ఉన్నారనే టాక్ కూడా ఉంది. ఏదైతేనేం చాలా ఏళ్లుగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు.

ఇప్పుడు నరేశ్ తో పవిత్ర సహజీవనం చేస్తోందని అంటున్నారు. త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నారు. అయితే తాము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అనే సీనియర్ నటీనటులు చెబుతున్నారు.