Begin typing your search above and press return to search.
'ఫిదా' కోసం కలిసినప్పుడు శేఖర్ కమ్ముల వద్దన్నారు: 'లవ్ స్టోరీ' మ్యూజిక్ డైరెక్టర్!
By: Tupaki Desk | 22 Sep 2021 7:32 AM GMTఈ మధ్య కాలంలో జనంలోకి బాగా దూసుకుపోయిన పాట 'సారంగధరియా'. 'లవ్ స్టోరీ' సినిమాలోని ఈ పాట, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దలవరకూ అన్ని వయసులవారి మనసులను గెలుచుకుంది. సారంగధరియా అంటే సారంగము అనే వాయిద్యాన్ని ధరించినది అనే ఒక అర్థం ఉంది. సారంగధరుడు అనే జానపాద కథలోకి వెళితే, ఆయనపై మనసు పారేసుకున్న యువతిని గురించి ప్రస్తావిస్తూ పాడుకునే పాటగాను కనిపిస్తుంది.
ఇది జానపద గీతమే అయినా సినిమా సాహిత్యాన్ని కలుపుకుని ముందుకు నడిచింది. సుద్దాల అశోక్ తేజ ఈ జానపద గీతానికి మరిన్ని సొగసులు అద్దారు .. మరిన్ని వయ్యారాలు నేర్పారు. అలాంటి ఈ పాటకి సంగీతాన్ని అందించిన యువ సంగీత దర్శకుడే పవన్ సీహెచ్. చూడటానికి కుర్రాడు కాస్త అమాయకంగా కనిపించినా, రెహ్మాన్ టీమ్ లో పనిచేశాడంటే విషయం విస్తృతంగా ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సినిమా ఈ నెల 24వ తేదీన విడుదలవుతూ ఉండటంతో, తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు.
"మా తాతయ్య .. నాన్న ఇద్దరూ కూడా సినిమాటోగ్రఫర్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. నాకు మాత్రం చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టం ఉండేది. ఈ విషయాన్ని గ్రహించి మా పేరెంట్స్ నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు. నా టాలెంట్ ను గుర్తించిన రెహ్మాన్ గారు నన్ను ఎంకరేజ్ చేశారు. ఆయన దగ్గర శివాజీ .. రోబో .. సర్కార్ మొదలైన సినిమాలకు పని చేశాను. ఆ తరువాత ఇక సంగీత దర్శకుడు అనిపించుకోవాలనే పట్టుదలతో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాను. ఆ సమయంలోనే శేఖర్ కమ్ములగారు 'ఫిదా' చేయడానికి రెడీ అవుతున్నారు.
వెంటనే నేను వెళ్లి శేఖర్ కమ్ములగారిని కలిశాను .. నా గురించి ఆయనకి చెప్పాను. ప్రస్తుతం కొత్తవాళ్లతో రిస్క్ చేసే ఆలోచన లేదని ఆయన చెప్పారు. దాంతో నేను నిరాశగా వెనుదిరిగాను. ఆ తరువాత 'లవ్ స్టోరీ' సినిమాకి ఆయనే పిలిపించారు. నేను 'హే పిల్లా' పాట చేసి వినిపించాను .. ఆయనకు బాగా నచ్చింది. ఆ తరువాత కూడా నాకు కొన్ని టెస్టులు పెట్టిగానీ ఓకే చేయలేదు. ఈ సినిమా పాటలకి వస్తున్న రెస్పాన్స్ నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మంచి సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకోవడమే ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం" అని చెప్పుకొచ్చాడు.