Begin typing your search above and press return to search.
భీమ్లా ఫలితంతో ఆ రీమేక్ పై పవన్ క్లారిటీ
By: Tupaki Desk | 26 April 2022 7:31 AM GMTపవన్ కళ్యాన్ వరుసగా రీమేక్ లతో సక్సెస్ లను దక్కించుకున్నాడు. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ ను తెలుగు లో వకీల్ సాబ్ గా రీమేక్ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇక మలయాళం సూపర్ హిట్ అయ్యప్పనుమ్.. సినిమా ను భీమ్లా నాయక్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. రీమేక్ లు ఈమద్య కాలంలో చాలా కామన్ అయ్యాయి. కనుక పవన్ మరిన్ని రీమేక్ లు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది.
ఇప్పటికే రెండు మూడు రీమేక్ లను పవన్ చేయబోతున్నట్లుగా ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ భీమ్లా నాయక్ సక్సెస్ తర్వాత రీమేక్ ల విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాడు. కొత్త కథల కంటే రీమేక్ ల వల్లే ప్రయోజనం ఎక్కువగా ఉంది కనుక రీమేక్ లు చేయాలని ఆయన భావిస్తున్నాడట. అందుకే తమిళ సూపర్ హిట్ మూవీ థేరీ ని తెలుగు లో రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యారని తెలుస్తోంది.
విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కి 2016 సంవత్సరంలో విడుదల అయిన చిత్రం 'థేరీ'. ఆ సినిమా లో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించాడు. తెలుగు లో థేరీని డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇక్కడ కూడా బాగానే ఆకట్టుకుంది. కాని విజయ్ కి పెద్దగా ఆ సమయంలో క్రేజ్ లేని కారణంగా జనాలు ఆ సినిమాను అప్పుడు పట్టించుకోలేదు.
అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. సాహో చిత్ర దర్శకుడు సుజీత్ ఇప్పటికే రీమేక్ కు సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. దానయ్య ఈ సినిమా ను నిర్మించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు ఊగిసలాటలో ఉండి భీమ్లా నాయన్ ఫలితం తర్వాత ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశాడు.
రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఇదే ఏడాది చివర్లో డేట్లు కూడా ఇచ్చేందుకు ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ముగింపు దశకు వచ్చింది. మరో వైపు భవదీయుడు భగత్ సింగ్ సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయాల్సి ఉంది.
ఈ రెండు సినిమాల తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాను పవన్ కళ్యాణ్ చేస్తాడనే వార్తలు వచ్చాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా కాస్త ఆలస్యం అయినా కూడా సుజీత్ దర్శకత్వంలో తేరీ సినిమా రీమేక్ ను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల లోపు సాధ్యం అయినన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. అందుకే సినిమా సినిమాకు రెండు మూడు నెలల సమయం కంటే ఎక్కువ కేటాయించవద్దని కూడా ఆయన ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయనతో వర్క్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేస్తున్నారు.