Begin typing your search above and press return to search.

పవన్ అభిమానుల ఫైర్.. కర్నూలు థియేటర్ పై రాళ్ల దాడి

By:  Tupaki Desk   |   2 Sept 2022 9:40 AM IST
పవన్ అభిమానుల ఫైర్.. కర్నూలు థియేటర్ పై రాళ్ల దాడి
X
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు కోపం కట్టలు తెగింది. తమ అభిమాన కథానాయకుడి సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించే వేళలో.. థియేటర్ వ్యవహరించిన వైఖరితో వారి సహనాన్ని పరీక్ష పెట్టింది.

తీవ్ర ఆగ్రహానికి గురైన వారు థియేటర్ మీద రాళ్ల దాడి జరిపిన అనూహ్య ఘటన తాజాగా చోటు చేసుకుంది. పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని కర్నూలులోని శ్రీరామ థియేటర్ లో ‘జల్సా’ మూవీ స్పెషల్ షో వేశారు.

గురువారం రెండు షోలు ప్రదర్శించిన వేళలో.. థియేటర్ లో సౌండ్ సిస్టం సరిగా లేకపోవటంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతోఅక్కడి సిబ్బందితో వారు వాగ్వాదానికి దిగారు.

అయితే.. థియేటర్ యాజమాన్యం సరైన రీతిలో రియాక్టు కాకపోవటంతో వారు ఆందోళనకు దిగారు. అయితే థియేటర్ యాజమాన్యం వ్యవహరించిన తీరుతో అసహనంతో వారు థియేటర్ పైకి రాళ్లు రువ్వారు. దీంతో.. థియేటర్ అద్దాలు మొత్తం పగిలిపోయాయి.

ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు థియేటర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేసే వారి టూవీలర్లను స్టేషన్ కు తరలించారు.

దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతం కర్నూలు పట్టణంలో సంచలనంగా మారింది. కాసింత ఉద్రిక్తతకు దారి తీసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.