Begin typing your search above and press return to search.

పవన్ కొడుక్కి ఏ పేరు పెడితే ఏంటి!!

By:  Tupaki Desk   |   11 Oct 2017 2:40 PM IST
పవన్ కొడుక్కి ఏ పేరు పెడితే ఏంటి!!
X
ప్రస్తుత రోజుల్లో తారల సినిమాల కన్నా వారి వ్యక్తిగత జీవితాల గురించే మీడియా ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటుంది. అందులో కొన్ని మీడియా చానెళ్లు అయితే కేవలం నెగిటివ్ వంటి అంశాలపైనే ప్రత్యకే కథనాలను ప్రసారం చేస్తాయి. దీంతో చాలా వరకు ఈ రోజుల్లో మీడియా వ్యవస్థకు అటువంటి పరిణామాలు చాలా చెడ్డపేరును తెస్తున్నాయి. అంతే కాకుండా జనాల్లో లేనిపోని ఊహలను కలిగిస్తున్నాయి.

ఇప్పుడు అదే తరహాలో పవన్ కళ్యాణ్ గురించి ఒక న్యూస్ చాలా వైరల్ అవుతోంది. ఆయనకు పుట్టిన కుమారుడి కి పవన్ క్రిస్టియన్ పేరు పెడతారా? లేక హిందూ పేరు పెడతారా? అని ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అయితే పవన్ క్యాస్ట్ గురించి ప్రస్తావించడానికి అస్సలు ఇష్టపడరు. ఆయన క్రిస్టియన్ కి చెందిన అన్నా ని వివాహమాడిన తర్వాత ఒక పాప జన్మించింది. అయితే భార్య ఇష్టప్రకారం క్రిస్టియన్ నేమ్ ఆ పాపకు పెట్టారు. హిందువా - క్రిస్టియాన్ అనే వర్గ భేదాలను పవన్ ఎప్పుడు పట్టించుకోలేదు. ఆ విషయాన్ని చాలా సార్లు పవన్ చెప్పాడు కూడా కానీ కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు జన్మించిన బాబుకు ఏ మతం పేరు పెడతారని చెప్పడంతో అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు.

ఇక కొంతమంది యాంటీ ఫ్యాన్స్ చిల్లర కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయని కామెంట్స్ చేస్తున్నారు మెగా అభిమానులు. కొంత మంది అభిమానులు వారి హీరోలని ఇష్టపడటం కన్నా ఇతర హీరోలని ఎక్కువగా ద్వేషిస్తున్నారని సినిమా లవ్వర్స్ అంటున్నారు. ఏదేమైనా కూడా.. పవన్ కొడుకు పవన్ ఇష్టం.. ఆయన ఏ పేరు పెట్టుకుంటే ఏంటి చెప్పండి!!