Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ వార‌సుడు.. ఎవ‌రి జీవితాన్ని కాపాడుతాడో..!

By:  Tupaki Desk   |   23 April 2022 4:30 AM GMT
ప‌వ‌న్ వార‌సుడు.. ఎవ‌రి జీవితాన్ని కాపాడుతాడో..!
X
అభిమానుల‌ను క‌లిగి ఉండ‌డ‌మే కాదు ఆద‌ర్శ‌వంత‌మైన అభిమానుల్ని క‌లిగి ఉండ‌డం కూడా ఇంపార్టెంట్. అయితే ఆద‌ర్శం కుటుంబం నుంచే మొద‌లైతే ఆ స్టార్ గొప్ప‌త‌నానికి జోహార్లు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అభిమానుల‌కు చాలా విష‌యాల్లో సామాజిక సేవా గుణంలో నిరంత‌రం స్ఫూర్తిగా నిలుస్తారు. ఇప్పుడు ప‌వ‌న్ వార‌సుడు అకీరా నంద‌న్ కూడా తండ్రికి త‌గ్గ ఆలోచ‌న‌లు క‌లిగిన బాల‌కుడు అని నిరూపిస్తున్నాడు. ర‌క్త‌దానంలో ఫ్యాన్స్ కి మ‌రింత‌గా స్ఫూర్తిని నింపాడు.

అకీరా నందన్ ఏప్రిల్ 8 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఇంత‌కుముందే రేణు తన కొడుకుకు సంబంధించిన ఒక‌ ఫోటోని పోస్ట్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. అక్క‌డ అకీరా రక్తదానం చేస్తున్నాడు. ``అకీరా 18 ఏళ్లు నిండిన తర్వాత చేసిన మొదటి రక్తదానం! అవసరంలో ఉన్నవారికి మనం ఇచ్చే అత్యంత విలువైన వస్తువు మన రక్తం.

దయచేసి మీకు 18 ఏళ్లు నిండిన తర్వాత మీకు వీలైనంత వరకు ర‌క్తాన్ని ఇత‌రుల‌కు దాన‌మివ్వండి. మీరు ఎవరి జీవితాన్ని రక్షించగలరో మీకు ఎప్పటికీ తెలియదు`` అని ఆమె క్యాప్షన్ ఇచ్చింది.

అకీరా నంద‌న్ హీరోగా ఎంట్రీ ఇచ్చే రోజు కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. కానీ దానికి ఇంకా స‌మ‌యం ఉంద‌ని రేణు చెబుతున్నారు. ప్ర‌స్తుతం అత‌డు బాక్సింగ్ ప‌రంగా శిక్ష‌ణ తీసుకుంటున్నార‌ని కూడా తెలిసింది.

దానికి సంబంధించిన ఫోటోని కూడా రేణు షేర్ చేసి ప‌వ‌న్ `త‌మ్ముడు` చిత్రాన్ని గుర్తు చేసారు. ఇక 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ రేణు నుంచి విడాకులు తీసుకున్నారు. అతనికి రేణుతో ఒక కూతురు.. కొడుకు ఉన్నారు. పిల్ల‌ల ఆల‌నా పాల‌నా విష‌యంలో రేణుతో పాటు ప‌వ‌న్ ఏ లోటూ రానివ్వ‌రు. ప్ర‌స్తుతం వారు హైదరాబాద్ లో చదువుతున్నారు.