Begin typing your search above and press return to search.
ఆ విషయంలో పవన్ ఎప్పుడూ టాప్
By: Tupaki Desk | 31 Oct 2019 4:21 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ సినిమాకు రంగం సిద్ధం అవుతోంది. మరో రెండు వారాల్లోనే సినిమా లాంచ్ జరగనుంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. పవన్ సినిమా అంటే ట్రేడ్ వర్గాల్లో డిమాండ్ భారీ స్థాయిలో ఉంటుంది.. అందులోనూ రీఎంట్రీ సినిమాపై మరింతగా ఆసక్తి ఉంటుంది. ఆ డిమాండ్ కు తగ్గట్టే సినిమాకు పవన్ భారీ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారట.
సీనియర్ ప్రొడ్యూసర్ ఎఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారని.. పవన్ డైరెక్ట్ గా రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాకు జరిగే బిజినెస్ నుండి షేర్ తీసుకుంటారని సమాచారం. ఆ షేర్ ఎమౌంట్ రఫ్ గా అంచనా వేస్తే దాదాపు రూ.50 కోట్లకు పైచిలుకే ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ పార్టనర్ గా పవన్ కళ్యాణ్ బ్యానర్ పేరు ఉంటుందట. ఈమధ్య పెద్ద స్టార్ హీరోలు కొందరు ఇదేరకంగా తమ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా అదే రూట్ ఫాలో అవుతున్నారట.
పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం.. భారీ రెమ్యూనరేషన్ తీసుకునేందుకు కారణం జనసేన పార్టీని నడిపేందుకు ఫండ్స్ సమకూర్చుకోవడం కోసమేనని కొందరు అంటున్నారు. ఏదేమైనా పవన్ రీఎంట్రీ సినిమా అభిమానుల్లో ఫుల్ జోష్ ను తీసుకొచ్చింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.