Begin typing your search above and press return to search.
ఇన్ని వాయిదాలు అయితే ఎలా పవన్?
By: Tupaki Desk | 27 Aug 2017 1:55 PM GMTకొంతమంది సెలబ్రిటీల తీరు చూస్తే కాస్త చిరాగ్గా అనిపించక మానదు. కోట్లాది మంది ఫ్యాన్స్ పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నా.. వారి నుంచి మణులు.. మాణిక్యాలు ఆశించకుండా.. కేవలం ఒక్క సినిమా మాత్రమే ఆశించినా అది కూడా ఇవ్వని తీరు చూస్తే.. కాస్తంత ధర్మాగ్రహం కలగటం ఖాయం.
నాకు నచ్చినప్పుడు.. తోచినప్పుడు సినిమాలు తీస్తా. మీరు చూడండి అంటూ చెప్పే హీరోలు మన ఇండస్ట్రీలో కనిపిస్తారు. ఒక అభిమాని.. తన హీరో నుంచి ఏం ఆశిస్తాడు? ఆ మాటకు వస్తే.. ఒక సెలబ్రిటీకి.. అభిమానికి లింకు ఏమిటి? వృత్తిపరంగా వారిని అభిమానించి..ఆరాధించినప్పుడు.. వారి వృత్తిపరమైన వర్క్‌ను ఆశించటానికి మించి ఇంకేం ఉండదు. ఒక హీరో అయితే ఏడాదికి ఒకట్రెండు సినిమాలు ఆశిస్తారు.
సదరు హీరో పుట్టినరోజు అయితే తన తాజా ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త విషయాన్ని విడుదల చేస్తే బాగుండని అనుకుంటారు. కానీ.. అది కూడా అత్యాశ అన్నట్లుగా కొందరు ప్రముఖల తీరు ఉంటుంది. అలాంటి వారిలో పవన్ కల్యాన్ ఒకరని చెప్పక తప్పదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అభిమానులకు ఎంత అభిమానమో.. ఎంత ఆరాధనా భావమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు.
అలాంటి పవన్ కల్యాణ్ నుంచి ఒక సినిమా రావాలంటే అదో పెద్ద ప్రయత్నంగా చెప్పక తప్పదు. ఎందుకు ఆలస్యమవుతుందో? మరెందుకు వాయిదాల మీద వాయిదాలు పడతాయో తెలీదు కానీ.. ఆయనకు సంబంధించిన ప్రాజెక్టు ఫైనల్ అయ్యే వరకూ టెన్షనే. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు సగటు అభిమాని నుంచి సినిమా పరిశ్రమ మొత్తం అలెర్ట్ అవుతుంది. అగ్రహీరో సినిమా అంటే బాక్స్ ఫీస్‌కు కూడా ఒకలాంటి కుతూహలం తన ఆకలిని తీర్చేస్తాడేమో.. కొత్త కొత్త రికార్డుల్సి సెట్ చేస్తారేమోనన్న అతృత ఉంటుంది.
కానీ.. అదేం సిత్రమో కానీ.. అభిమానులు ఇంతగా ఎదురుచూస్తున్నా.. ఏడాదికి ఒక సినిమా పవన్ నుంచి రావటం కనా కష్టమవుతుంది. తాను రాజకీయాల్లోకి చురుగ్గా పాలు పంచుకోనున్నట్లు చెబుతూ.. సినిమాలు తక్కువ చేస్తానని చెప్పటం తెలిసిందే. అలా అని.. రాజకీయాల్లో ఏమైనా వీర బిజీగా ఉన్నారా? అంటూ అది ఉండదు. రెండు పడవల మీద కాళ్లు మాదిరి ఇటు సినీ అభిమానుల్ని.. అటు రాజకీయ అభిమానుల్ని.. మొత్తంగా తనను వీర లెవెల్లో అభిమానించి.. ఆరాధించే వారికి ఏదో రీతిలో కొరత మిగిల్చటం పవన్‌కు మాత్రమే సాధ్యమవుతుందేమో?
ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయనో సినిమా చేస్తున్నారు. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఈ ఏడాది చివర్లో విడుదల పక్కా అన్నారు. అది కాస్తా వచ్చే ఏడాది సంక్రాంతి వరకూ వెళ్లింది. విడుదలను పక్కన పెడితే.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను పవన్ బర్త్ డే అయిన సెప్టెంబరు 2న రిలీజ్ చేస్తారన్న మాట బలంగా వినిపించింది. కానీ.. ఇప్పటివరకూ అలాంటి ఛాయలేమీ లేవు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. పవన్ పుట్టిన రోజు నాడు ఫస్ట్ లుక్ విడుదలయ్యే ఛాన్స్ లేదని చెబుతున్నారు.
ఈ సమాచారం పవన్ ఫ్యాన్స్ కు విపరీతమైన నిరాశకు గురి చేస్తుందని చెప్పక తప్పదు. గడిచిన కొద్ది రోజులుగా రాజకీయాలకు సైతం దూరంగా ఉన్న పవన్.. అటు సినిమాలతో కానీ ఇటు రాజకీయాలతో కానీ తనను అభిమానించే వారిని అలరించకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. వారు చూపించే అభిమానం యాంగివారలో చూస్తే.. వారలా రియాక్ట్ కావటంలో తప్పేం లేదేమో?