Begin typing your search above and press return to search.

గాలి వాలుగా గుండెను తాకిన పవన్

By:  Tupaki Desk   |   12 Dec 2017 7:16 AM GMT
గాలి వాలుగా గుండెను తాకిన పవన్
X
పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాత మూవీ కోసం అభిమానులు మాత్రమే కాదు.. ఇటు టాలీవుడ్ ఆడియన్స్.. అటు ఇండస్ట్రీ జనాలు కూడా తెగ ఎదురుచూస్తున్నారు. పవన్ సినిమా వచ్చిందంటే థియేటర్లకు పండుగ వచ్చేసినట్లే కావడమే ఇందుకు కారణం. కోలీవుడ్ సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్.. తొలిసారిగా స్వరపరిచిన చిత్రం కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా స్వరాలు సమకూర్చుతున్నాడు అనిరుధ్. పవన్ స్టైల్ కి కాస్త భిన్నం అనిపిస్తున్నా.. వింటుండగానే శ్రోతలను తెగ మెప్పించేస్తున్నాయి. ఇప్పటికే బైటకొచ్చి చూస్తే అంటూ తొలి పాటను విడుదల చేయగా.. ఇప్పుడు గాలివాలుగా అంటూ సాగే పాటకు లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. 'గాలివాలుగా ఓ గులాబి వాలి.. గాయమైనది నా గుండెకు తగిలి' అంటూ సాగే పాట.. సూపర్బ్ గా ఉంది.

టాలీవుడ్ బెస్ట్ మెలోడీస్ లో ఒకటిగా నిలిచేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటే.. గాలివాలుగా సాంగ్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో అర్ధమవుతుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ పాటను.. అనిరుధ్ స్వయంగా ఆలపించడం విశేషం. కీర్తి సురేష్, అను ఇమాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న అజ్ఞాతవాసి చిత్రం.. వచ్చే నెల 10వ తేదీన థియేటర్లలోకి వచ్చేయనుంది.

గాలివాలుగా సాంగ్ వినేందుకు క్లిక్ చేయండి