Begin typing your search above and press return to search.

అజ్ఞాతవాసి ఆడియో డేట్ మారిందోచ్

By:  Tupaki Desk   |   7 Dec 2017 5:39 AM GMT
అజ్ఞాతవాసి ఆడియో డేట్ మారిందోచ్
X
పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25వ చిత్రం అజ్ఞాతవాసి. జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో చాలానే అంచనాలు ఉన్నాయి. దసరా తర్వాత థియేటర్లను ఫుల్లుగా నింపేయగల సత్తా ఉన్న సినిమా ఇదే కావడమే ఇందుకు కారణం. మరోవైపు 150 కోట్లకు పైగా రిలీజ్ బిజినెస్ చేశారనే వార్తలు కూడా సెన్సేషన్ అవుతున్నాయి.

ఇంతేసి వసూళ్లను అందుకునేందుకు ప్రచారంతో పాటు చాలానే టెక్నిక్స్ అవలంబిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. అజ్ఞాతవాసి చిత్రానికి ఈ నెలలోనే ఆడియో కూడా రిలీజ్ ఫంక్షన్ కూడా నిర్వహించనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ 14.. 15 తేదీల్లో విడుదల చేయాలని భావించారు. అయితే.. తెలుగు మహాసభలు జరుగుతున్న కారణంగా.. డిసెంబర్ 19వరకూ ఈ స్థాయి ఫంక్షన్ నిర్వహించేందుకు పోలీసులు నిరాకరించారు. అందుకే డిసెంబర్ 21న ఈ చిత్రం ఆడియో విడుదల చేయాలని నిర్ణయించారట.

హైద్రాబాద్ లోనే ఈ కార్యక్రమం జరగనుండగా.. ఇంకా వెన్యూ ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం అజ్ఞాతవాసి పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తుండగా.. బయటకొచ్చి చూస్తే అనే పాట ట్రెండింగ్ అయిపోయింది. ఈ సినిమా నుంచి గాలి వాలుగా అంటూ సాగే రెండో పాటను డిసెంబర్ 11న విడుదల చేయనున్నట్లు యూనిట్ ఇవాళే ప్రకటించింది.