Begin typing your search above and press return to search.
పవన్ మిగతా వాళ్లకు ఛాన్సిస్తాడా?
By: Tupaki Desk | 17 Dec 2017 3:30 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్-ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే చాలా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. అందులోనూ ‘అత్తారింటికి దారేది’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్లిద్దరూ జత కట్టేసరికి అంచనాలు మరింత పెరిగిపోయాయి. దీనికి తోడు ‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ లుక్.. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు అంచనాల్ని మరింత పెంచాయి. ఇక టీజర్.. ఫుల్ ఆడియో.. ట్రైలర్ వచ్చాక హైప్ ఇంకెంతగా పెరుగుతుందో చూడాలి. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమా లేని స్థాయిలో అమెరికాలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారంటే హైప్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సైతం ‘బాహుబలి: ది కంక్లూజన్’కు ఏమాత్రం తగ్గని స్థాయిలో ‘అజ్ఞాతవాసి’ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
సంక్రాంతి సీజన్లో ముందు రాబోయేది ‘అజ్నాతవాసి’నే అన్న సంగతి తెలిసిందే. జనవరి 10న రెండు తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం థియేటర్లలో ఈ చిత్రాన్నే వేసేస్తారనడంలో సందేహం లేదు. ఐతే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన పక్షంలో ‘అజ్ఞాతవాసి’ని ఖాళీ చేసి వేరే వాళ్లకు థియేటర్లు ఇస్తారా అన్నది డౌటు. బాలయ్య సినిమా ‘జై సింహా’ మీద అంతగా అంచనాలైతే లేవు. ఐతే ముందే థియేటర్ల కోసం అగ్రిమెంట్లు జరుగుతాయి కాబట్టి దానికి ఓ మోస్తరుగా థియేటర్లు దక్కొచ్చు. ఐతే తమిళ డబ్బింగ్ సినిమా ‘గ్యాంగ్’కు థియేటర్లు దొరకడం మాత్రం అంత సులువు కాదు. పోటీ తక్కువ ఉంది కదా అని.. కుదిరితే ఇంకో సినిమాను కూడా రిలీజ్ చేద్దామని చూస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. కానీ ‘అజ్ఞాతవాసి’ మీద ఉన్న హైప్ ప్రకారం చూస్తే మాత్రం దీనికి పోటీగా వెళ్లడం మంచిది కాదని.. పవన్-త్రివిక్రమ్ వేరే వాళ్లకు ఛాన్సివ్వరని అంటున్నారు. త్రివిక్రమ్ సినిమా అంటేనే మినిమం గ్యారెంటీ అన్న అభిప్రాయం జనాల్లో ఉంటుంది. దీనికి టాక్ ఓ మోస్తరుగా వచ్చినా చాలు.. బాక్సాఫీస్ దాడి మామూలుగా ఉండదు. పోటీలో ఉన్న సినిమాలకు బ్యాండ్ తప్పదు.