Begin typing your search above and press return to search.

క్లాసుగా మాస్.. డిసెంబర్ 16న..

By:  Tupaki Desk   |   12 Dec 2017 10:42 AM GMT
క్లాసుగా మాస్.. డిసెంబర్ 16న..
X
అజ్ఞాతవాసి సినిమా కోసం ఒక్క పవన్ అభిమానులే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా సినిమా ఎలా ఉంటుందో గాని రిలీజ్ కు ముందే సినిమా స్థాయి చాలా వరకు పెరిగిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా అభిమానులు అజ్ఞాతవాసి గురించి ఎదో ఒక విషయం పై చర్చించుకునుటున్నారు. ఇక ఇదే సమయంలో చిత్ర యూనిట్ సినిమా పోస్టర్స్ పాటలను రిలీజ్ చేస్తూ ఇంకా సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది.

ఈ రోజు ఉదయం గాలి వాలుగా అనే సాంగ్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అనిరుద్ మెలోడీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక రీసెంట్ గా మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకునే విధంగా పవర్ స్టార్ స్టైయిలిష్ లుక్ ని రిలీజ్ చేశారు. చేతిలో సైకిల్.. నోట్లో బెల్ట్ తో కసిగా కోపంతో ఉన్న కళ్లు అందరిచేత వావ్ అనిపిస్తున్నాయి. క్లాస్ అబ్బాయి ఒక్కసారిగా మాస్ లుక్ లోకి మారితే ఎలా ఉంటాడో ఆ విధంగా పవన్ ఉన్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే సినిమా టీజర్ ఈ నెల 16న రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్ గా టీజర్ ని కూడా రెడీ చేసి ఉంచారు. ఇక శనివారం అనుకున్న టైమ్ కి సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయనున్నారు. ఆ టైమ్ ని కూడా త్రివిక్రమ్ త్వరలోనే చెబుతారట. ఇక పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్ - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే.