Begin typing your search above and press return to search.

హాలీవుడ్ లో పవన్ ఫీవర్

By:  Tupaki Desk   |   6 Jan 2018 10:53 AM GMT
హాలీవుడ్ లో పవన్ ఫీవర్
X
ప్రపంచంలో ఎల్లలు లేనిది అభిమానానికి ఒక్కటే. అందులోనూ సినిమా హీరోలకైతే మరీనూ. ఇక పవన్ కళ్యాణ్ సంగతి ప్రత్యేకంగా చెప్పాలా. అసలు ఇంతవరకు థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాకుండా ఇంత హైప్ వచ్చిన సినిమా బహుశా ఈ మధ్య కాలంలో అజ్ఞాతవాసి ఒకటే అనిపిస్తోంది. ఇది మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. యుఎస్ లో కూడా పవన్ ఫాన్స్ అజ్ఞాతవాసి ఫీవర్ తో ఊగిపోతున్నారు. దానికి సంబంధించి కొన్ని పిక్స్ వాళ్లే స్వయంగా షేర్ చేసుకోవడంతో ఇక్కడి అభిమానులు వాటిని చూసి ఇది మా పవర్ స్టార్ అనుకుంటూ మురిసిపోతున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియో ముందు ప్రవాస భారతీయులు అజ్ఞాతవాసి విడుదలను పురస్కరించుకుని బ్యానర్లతో తమ సంతోషాన్ని తెలియజేసే ఫోటోలు ఆన్ లైన్ లో బాగా షేర్ అవుతున్నాయి.

ఇప్పటి దాకా ఏ తెలుగు సినిమా విడుదల కానన్ని అత్యధిక లోకేషన్స్ తో ఓవర్సీస్ లో కూడా కొత్త రికార్డు సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ రెవిన్యూ పరంగా కూడా బాహుబలిని టచ్ చేయడం లేదా బీట్ చేయడం గురించి అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి రోజే మిలియన్ డాలర్ క్లబ్ లోకి అజ్ఞాతవాసి అడుగుపెడతాడని ఎన్ ఆర్ ఐలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్వాగతం కృష్ణా అనే పాటకు డాన్స్ చేస్తూ పవన్ కు వెల్కం చెబుతూ ఒక వీడియో కూడా షూట్ చేసుకుని పోస్ట్ చేయటం విశేషం. అఫీషియల్ రిలీజ్ డేట్ 10నే అయినప్పటికీ 9వ తేది రాత్రి నుంచే ప్రీమియర్ షోల హడావిడి తెలుగు స్టేట్స్ తో పాటు ఓవర్సీస్ లో ప్రారంభం కానుంది. వార్నర్ స్టూడియోస్ వద్ద ఇదే తరహా సందడి పవన్ ఫాన్స్ చేసినట్టు తెలిసింది. రాకముందే పరిస్థితి ఇలా ఉంటే 10వ తేది ఏంటి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం.