Begin typing your search above and press return to search.

అజ్ఞాతవాసి.. ప్రిమియర్లతోనే 2 మిలియన్లు!

By:  Tupaki Desk   |   2 Jan 2018 12:10 PM GMT
అజ్ఞాతవాసి.. ప్రిమియర్లతోనే 2 మిలియన్లు!
X
దశాబ్దం కిందట అమెరికాలో తెలుగు సినిమా విడుదలవడమే గగనంగా ఉండేది. కానీ ఇప్పుడు యుఎస్ మార్కెట్ చాలా కీలకంగా మారింది. అక్కడి నుంచి భారీ మొత్తంలో ఆదాయం వస్తోంది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఏకంగా రూ.120 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది అమెరికాలో. దాంతో అన్ని సినిమాలనూ పోల్చలేం కానీ.. మన సూపర్ స్టార్ల సినిమాలు భారీగా వసూళ్లు సాధిస్తున్న మాట వాస్తవం. యుఎస్ లో తెలుగు సినిమాల మార్కెట్ స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించిన మహేష్ బాబు.. తన ఫ్లాప్ సినిమాలతో కూడా అక్కడ మిలియన్ మార్కును దాటేస్తుంటాడు. అతడి చివరి సినిమా ‘స్పైడర్’ అంతిమంగా డిజాస్టరే అయినప్పటికీ.. ప్రిమియర్లతోనే మిలియన్ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఏకంగా 3 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది ప్రిమియర్లతో.

ఇక ‘అజ్ఞాతవాసి’ ఆ సినిమాకు దీటుగా ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. ‘బాహుబలి-2’ కంటే ఎక్కువగా.. ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీ లేని స్థాయిలో 580 లొకేషన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం విశేషం. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. త్రివిక్రమ్ ఒక్కడికే యుఎస్‌లో మంచి మార్కెట్ ఉంది. అతడి చివరి సినిమా ‘అఆ’ 2.4 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. ఇక అతడికి పవన్ తోడైతే చెప్పేదేముంది? ఈ చిత్రం ప్రిమియర్లతోనే ఈజీగా 2 మిలియన్ మార్కును దాటేస్తుందని.. టాక్ పాజిటివ్‌ గా ఉంటే 5 మిలియన్ మార్కును కూడా అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. జనవరి 9న భారీ స్థాయిలో ఈ చిత్రానికి ప్రిమియర్లు పడబోతున్నాయి.