Begin typing your search above and press return to search.

ప్రిన్స్ ఇన్ లీడింగ్

By:  Tupaki Desk   |   9 Jan 2018 7:54 AM GMT
ప్రిన్స్ ఇన్ లీడింగ్
X
తెలుగు సినిమా పరిధి అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతోంది అని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. బాహుబలితో ఏ బాషా సినిమాతో అయినా పోటీ పడగలం అని నిరూపించాక తెలుగు సినిమా మార్కెట్ అంతకంతకూ పెరిగిపోతోంది. దీనికి మరింత క్లారిటీ ఇచ్చేందుకు పవన్ అజ్ఞాతవాసి కూడా మరొక రికార్డు జోడించాడు. ఇప్పటికే యుఎస్ లో 570 స్క్రీన్లలో ప్రీమియర్ షోల తో ట్రెండ్ సెట్ చేసిన పవన్ టికెట్ బుకింగ్ విషయంలో మహా మహా హాలీవుడ్ సినిమాలనే తలదన్ని మరో కొత్త రికార్డు సృష్టించాడు.

ప్రముఖ టికెట్ బుకింగ్ వెబ్ సైట్ మూవీ టికెట్స్ వెల్లడించిన సమాచారం మేరకు అత్యధికంగా అమ్ముడైన టికెట్స్ లో అజ్ఞాతవాసి 26.4% షేర్ తో ముందంజలో ఉండగా ఈ మధ్య హాలీవుడ్ సినిమాల్లో బాగా వార్తల్లో నిలిచిన జుమాన్జి కేవలం 12.8 శాతంతో సరిపెట్టుకుంది.

హారర్ ప్రియులు చాలా ఆసక్తితో ఎదురు చూసిన ఇన్సీడియస్ 9.1%, స్టార్ వార్స్ లాస్ట్ జెడి 8.9%, గ్రేటెస్ట్ షోమాన్ 8.4% శాతంతో చివరి స్థానంలో నిలిచాయి. ఇప్పటికే ఉన్న లెక్కల ప్రకారం అజ్ఞాతవాసి ప్రీమియర్ షో అడ్వాన్సు బుకింగ్ తో టాప్ 5 తెలుగు మూవీస్ లో ప్లేస్ తీసేసుకుంది. ఈజీగా ఖైది నెంబర్ 150ని బ్రేక్ చేసే అంచనాలు ఉండగా బాహుబలి 2ని టచ్ చేసినా ఆశ్చర్యం ఏమి లేదని ట్రేడ్ లెక్కలు వేస్తున్నారు. అజ్ఞాతవాసి సునామి యుఎస్ లోనే ఆ రేంజ్ లో ఉంటే ఇక ఇక్కడ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మూడు రోజులకు దాదాపు బుకింగ్ మొత్తం అయిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. పవన్ చేయబోయే రచ్చ రానున్న రోజుల్లో ఇంకే స్థాయిలో ఉండబోతోందో అని పవన్ ఫాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.