Begin typing your search above and press return to search.
రజినీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న సినీ ప్రముఖులు అభిమానులు..!
By: Tupaki Desk | 25 Dec 2020 3:30 PM GMTతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హై బీపీ తో తీవ్ర అస్వస్థతకు గురై ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. రజినీకి కరోనా నిర్ధారణ టెస్ట్ చేయగా ఆయనకు నెగిటివ్ అని వచ్చింది. అయితే ఈరోజు ఆయన బ్లడ్ ప్రెజర్ డౌన్ అయి కాస్త అస్వస్థతకు లోనవడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించింది. అయినప్పటికీ రజినీకాంత్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు అభిమానులు రజినీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రజినీకాంత్ త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ తరపున ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ రజినీ ఆరోగ్యంపై తన స్పందనను తెలియజేసాడు. రజనీకాంత్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసి బాధపడ్డానని.. ఆయనకు కరోనా లక్షణాలు లేవని వైద్యులు ప్రకటించడం ఊరటనిచ్చిందని పవన్ పేర్కొన్నాడు. మనోధైర్యం మెండుగా ఉన్న రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని.. ఆధ్యాత్మికపరులైన ఆయనకు భగవదనుగ్రహం కలగాలని.. ఆయన ఎంతగానో విశ్వసించే మహావతార్ బాబాజీ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కాగా, రజినీకాంత్ కి రెండు రోజుల పాటు చికిత్స అవసరమని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనతో పాటు కుమార్తె ఐశ్వర్య ఆస్పత్రిలోనే ఉన్నట్లు సమాచారం.