Begin typing your search above and press return to search.
చెర్రీ విజయం వెనుక `అజ్ఞాత` హస్తాలు
By: Tupaki Desk | 1 April 2018 6:17 AM GMTవిలక్షణ దర్శకుడు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో తెరకెక్కిన `రంగస్థలం` హిట్ టాక్ తో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే. సౌండ్ ఇంజనీర్ గా చిట్టిబాబు నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. `చిట్టిబాబు` పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన చెర్రీ...ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు. ఈ సౌండ్ ఇంజనీర్ దెబ్బకు ఇండియాతో సహా ఓవర్సీస్ బాక్సాఫీసుల దగ్గర కూడా కాసుల మోత మోగుతోంది. ప్రత్యేకించి ఓవర్సీస్ లో `రంగస్థలం` చిత్రానికి రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కలెక్షన్లకు సమానంగా మొదటి రోజు కలెక్షన్లు వచ్చాయంటే అక్కడ మూవీ బజ్ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఓవర్సీస్ లో చెర్నీ రికార్డు కలెక్షన్ల వెనుక ఇద్దరి `అజ్ఞాత` హస్తముందని ట్రేడ్ టాక్.
ఓవర్సీస్ లో చెర్రీకి బాబాయ్ పవన్ కల్యాణ్ పరోక్షంగా సాయపడ్డాడని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవర్సీస్ లో `అజ్ఞాతవాసి`ని 500లకు పైగా సెంటర్స్ లో ప్రీమియర్ షోలు వేశారు. ఆ చిత్రం ప్రీమియర్స్ లో 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే, ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ప్రీమియర్స్ వేసిన 70 శాతం థియేటర్లలో 1000 డాలర్లు కూడా వసూలు కాలేదు. దీంతో, రంగస్థలం విషయంలో జాగ్రత్తలు తీసుకునే అవకాశం వచ్చింది. కలెక్షన్లు గట్టిగా వస్తాయనుకున్న సెంటర్లలో రంగస్థలం రిలీజ్ చేశారు. దీనికి తోడు సినిమాకు మంచి టాక్ రావడం అదనపు బలం. మరోవైపు ఓవర్సీస్ తో పాటు లోకల్ లో కూడా `రంగస్థలం`ను తక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం వెనుక చెర్రీ మామయ్య అల్లు అరవింద్ పక్కా స్కెచ్ ఉందట. `సరైనోడు`కు కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసి మంచి కలెక్షన్లు రాబట్టిన అరవింద్....ఇదే ఫార్ములాను చెర్రీకి అప్లై చేశారట. దీంతో, ఏపీ - తెలంగాణలో కలిపి 80 శాతం థియేటర్లలో `రంగస్థలం`విడుదల చేసే అవకాశం ఉన్నా - పరిమిత థియేటర్లలో రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారట.