Begin typing your search above and press return to search.

ఆమెకు రంగస్థలం అర్ధమైందా? లేదా?

By:  Tupaki Desk   |   10 April 2018 11:30 PM GMT
ఆమెకు రంగస్థలం అర్ధమైందా? లేదా?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణంగా తన సినిమాలు తాను ఎక్కువగా చూసుకోను అంటారు. అది అందరికి తెలిసిన విషయమే. కానీ కుటుంబంలో ఎవరి సినిమా అయినా రిలీజ్ అయితే స్పెషల్ స్క్రీన్ వేసుకొని చూడటం అలవాటు. గత కొంత కాలంగా రాజకీయాలలో బిజీగా ఉండడం వల్ల పవన్ సినిమాలకు దూరంగానే ఉన్నారు. ఇక రంగస్థలం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పట్టుబట్టి మరీ స్పెషల్ షో వేయించుకున్నాడు పవన్.

నిన్న ఐమాక్స్ లో పవన్-చరణ్ ఇద్దరు కూడా సతి సమేతంగా వచ్చి సినిమాను తిలకించారు. అయితే పవన్ భార్య అన్నా లెజినోవాకి తెలుగు బాగా వచ్చనే ఒక టాక్ ఉంది. పైగా సంప్రదాయాలను బాగానే పాటిస్తున్నట్లు మీడియాల్లో కనిపించినప్పుడు అర్ధమవుతుంది. ట్రెడిషినల్ గా కనిపిస్తూ ఉండే అన్నాకి రంగస్థలం సినిమా ఎంతవరకు అర్థమై ఉంటుందనేది ఇప్పుడు కొందరిలో నడుస్తోన్న చర్చ. అసలే గోదావరి యాస నార్మల్ గా మాట్లాడే భాషకు ఇది చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. పైగా సినిమాకు సబ్ టైటిల్స్ కూడా లేవు. అందుకే ఈ సందేహం వచ్చింది.

అయితే గత కొంత కాలంగా ప్రత్యేకంగా ఒక ట్యూటర్ ను పెట్టుకుని మరీ అన్నా తెలుగు నేర్చుకుంటోంది. తమ ఇంట్లో ఉన్న క్యూబ్ శాటిలైట్ హోమ్ ధియేటర్ లో వారానికి రెండు మూడు తెలుగు సినిమాలు చూస్తూ బాగా తెలుగు నేర్చేసుకుందట. అందుకే ఆమెకు సినిమా ఇట్టే అర్ధమైపోయిందని.. బయట రూమర్లు వస్తున్న ఆమెకు తెలుగు రాకపోవడం వలన పవన్ కళ్యాణ్‌ ట్రాన్ల్సేట్ చేశాడనంలో అర్ధం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. అది సంగతి.