Begin typing your search above and press return to search.

పవన్- బాలయ్య ఫ్యాన్స్.. ఎక్స్‌ ఛేంజ్ స్కీం

By:  Tupaki Desk   |   9 Jan 2018 11:56 AM GMT
పవన్- బాలయ్య ఫ్యాన్స్.. ఎక్స్‌ ఛేంజ్ స్కీం
X
అజ్ఞాతవాసి చిత్రానికి తొలి రోజు టికెట్స్ సంపాదించడం ఎలా.. ఇప్పుడు ఇదో పెద్ద పజిల్ అయిపోయింది. మన దగ్గర వారం రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయిపోవడంతో.. టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇలా ఆన్ లైన్ లో టికెట్స్ పెట్టడం.. అలా ఫుల్ అయిపోవడం చూసి.. తల పండిన ట్రేడ్ పండితులు కూడా షాక్ తినేస్తున్నారు.

ఎన్ని థియేటర్లు ఇచ్చినా సరే.. అజ్ఞాతమూవి క్రేజ్ కి అవేమీ చాలడం లేదు. అయితే.. నందమూరి అభిమానులు మాత్రం ఇందుకు ఓ చక్కని మార్గం కనుగొన్నారు. చాలాచోట్ల బాలయ్య అభిమానులు.. పవన్ అభిమానులతో బేరాలు పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు అజ్ఞాతవాసి మూవీకి తమకు టికెట్స్ ఇవ్వాలని.. బదులుగా జైసింహా రిలీజ్ తర్వాత.. ఆ సినిమా టికెట్స్ ఇస్తామని ఆఫర్స్ ఇస్తున్నారట బాలయ్య ఫ్యాన్స్. బాలయ్య ఫ్యాన్స్ తమంతట తామే పవన్ కళ్యాణ్ మూవీ తొలి రోజు చూస్తామని అడుగుతుండడంతో.. పవర్ స్టార్ ఫ్యాన్స్ పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారట.

అయితే.. ప్రస్తుతం అజ్ఞాతవాసి టికెట్స్ కి నెలకొన్న భారీ డిమాండ్ కారణంగా.. బాలయ్య ఫ్యాన్స్ అడిగిన మేరకు టికెట్స్ ను అందించలేకపోతున్నారట పవన్ అభిమానులు. అవసరం అయితే.. నందమూరి ఫ్యాన్స్ కు తమ టికెట్స్ ఇచ్చేసి అయినా వారు సినిమా చూసేందుకు సహకరిస్తామని కొన్ని చోట్ల పవన్ ఫ్యాన్స్ ప్రతిజ్ఞలు కూడా చేసేస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. టికెట్స్ సంగతి ఎలా ఉన్నా.. ఈ ఎక్స్ ఛేంజ్ స్కీమ్ మాత్రం టాలీవుడ్ లో మారుతున్న పరిణామాలకు నిదర్శనం.