Begin typing your search above and press return to search.

పవన్‌-దాసరి సినిమా ఉన్నట్టా? లేనట్టా?

By:  Tupaki Desk   |   17 March 2015 5:23 AM GMT
పవన్‌-దాసరి సినిమా ఉన్నట్టా? లేనట్టా?
X
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా దాసరి దర్శకత్వంలో ఓ సినిమా త్వరలోనే ప్రారంభం.. ఈ వార్త విన్న మెగాభిమానులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

మెగా కుటుంబంతో వైరం నడిపిస్తున్న దాసరి ఉన్నట్టుండి ఇలా అనేశాడేంటి? అనుకున్నారంతా. ఫేస్‌బుక్‌లో వచ్చిన వార్తల్ని నమ్మాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడ్డారు. ఆ వెంటనే పవన్‌ దారి వేరు. అతడి రూటు సపరేటు.. ఏం జరిగినా జరగొచ్చు అంటూ తమాయించుకున్నారు. ఒకవేళ దాసరితో సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అనుకున్నారు.

అంతేకాదు ఆ వార్తపై ఔనని కానీ, కాదని కానీ పవన్‌ స్పందించకపోవడంతో నిజంగానే ఈ సినిమా సెట్స్‌కెళుతుందని అనుకున్నారు. మొన్నటి రోజున సన్నాఫ్‌ సత్యమూర్తి ఆడియో వేదికపై దాసరి స్పందించిన తీరు కూడా కొంత చర్చోపచర్చలకు దారి తీసింది. వాస్తవంగానే పవన్‌ మెగా ఈవెంట్లకు రావడానికి ఇష్టపడడం లేదు. రాడు కూడా. పైగా అన్నయ్యకే వ్యతిరేకంగా వెళ్లి పార్టీ పెట్టాడు. కాబట్టి దాసరితో పవన్‌ ముందుకెళుతున్నాడనే అనుకున్నారంతా. అయితే ఇప్పటివరకూ ఆ సినిమాకి సంబంధించి అతీగతీ లేనేలేదు. వార్త గుప్పుమన్నంత మాత్రాన అదే నిజం అనుకోవడానికి లేదు.

ఒకవేళ నిజంగానే పవన్‌ దాసరి దర్శకత్వంలో నటిస్తే మాత్రం కచ్ఛితంగా మెగాస్టార్‌ అభిమానుల కోపానికి గురైనట్టే. కాబట్టి ఈ గేమ్‌ ఎటెళ్తుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కంటిన్యూషన్‌ న్యూస్‌ కోసం లోకం ఆత్రంగా వేచి చూస్తోంది.