Begin typing your search above and press return to search.
నాలుగోసారి తండ్రవుతున్నపవన్?
By: Tupaki Desk | 9 May 2017 7:40 AM GMTఆల్రెడీ తన 2వ భార్య రేణు దేశాయ్ ద్వారా.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు అకీరా.. కూతురు ఆద్య ఉండగా.. ఆ తరువాత ఆయన అన్నా లెజినోవాను పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమెతో పవన్ కళ్యాణ్ కు పొలెనా అనే కూతురుంది. అయితే ఇప్పుడు మరోసారి జనసేన అధినేత తండ్రి కాబోతున్నారా అంటే.. అవుననే అంటున్నారు సన్నిహితులు. ఈ మొత్తం విషయంపై డెక్కన్ క్రానికల్ ఈరోజు ఒక సంచలన కథనమే ప్రచురించింది. లెటజ్ సీ.
పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇప్పుడు ప్రెగ్నెంట్ అని సదరు వార్త సారాంశం. ఆల్రెడీ ఈ జంట పొలెనాకు తల్లిదండ్రులు అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్నా లెజినోవా మరోసారి కడుపుతో ఉందట. అందుకే పవన్ కళ్యాణ్‌రోజూ షూటింగ్ పూర్తవ్వగానే టైముకు ఇంటికి వెళ్లిపోయి ఆమెను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి క్లారిటీ కాని.. అఫీషియల్ గా ఎటువంటి స్పందన కాని లేదు. కాకపోతే ఈ విషయం నిజం అంటూ డెక్కన్ క్రానికల్ చెప్పడం ఇప్పుడు పెద్ద విషయం అయిపోయింది.
ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరక్షన్లో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అది సంగతి.