Begin typing your search above and press return to search.
పవన్ 27వ సినిమా రియల్ బందిపోటు కథేనా?
By: Tupaki Desk | 30 Jan 2020 2:30 AM GMTఓపక్క రాజకీయాలు మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీ కావాలని భావిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా దిల్ రాజు నిర్మిస్తున్న హిందీ పింక్ మూవీలో లాయర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తో పాటు.. అతి తక్కువ కాల్షీట్లు ఇచ్చిన వైనం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఉదయం రాజకీయాలు.. రాత్రి వేళ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇప్పటికే పట్టాలకెక్కటం.. ఈ సినిమాలో పవన్ గెటప్ ఫోటోలు కొన్ని బయటకు రావటం తెలిసిందే. ఇదిలా ఉంటే..దిల్ రాజు సినిమా ఓపక్క సాగుతున్న వేళలోనే.. పవన్ మరో సినిమా షురూ కానుంది. క్రిష్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర సమాచారం తాజాగా బయటకు వచ్చింది.
తొలిసారి పవన్ సినిమాకు సంగీతదర్శకుడిగా కీరవాణి వ్యవహరిస్తున్న ఈ సినిమా పిరియాడిక్ మూవీగా చెబుతున్నారు. బాపట్లకు సమీపంలోని సువార్టుపురంలో బందిపోటు దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పవన్ కల్యాణ్ పుట్టింది కూడా బాపట్లలోనే. 1980లలో గజదొంగ టైగర్ నాగేశ్వరరావు గురించి బాపట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో టైగర్ నాగేశ్వరరావు గురించి గొప్పగా కథలు..కథలుగా చెప్పేవారు.
పెద్దోళ్లను దోచేసి.. చిన్నోళ్లకు పంచి పెట్టే అతను.. పోలీసులకు సవాలు విసిరి మరీ దొంగతనాలు చేసే వారిన చెబుతారు. ఆయన్ను పోలీసులు కాల్చి చంపినట్లుగా చెబుతారు. బడుగు బలహీన వర్గాల్లో టైగర్ నాగేశ్వరరావుకు ఉన్న ఇమేజ్ ఎక్కువ. కాలక్రమంలో చాలామంది మర్చిపోతున్న వేళ.. పవన్ ఆ గజదొంగ మీద తీస్తున్న మూవీలో ప్రధానపాత్ర పోషిస్తున్నారన్న వార్త ఆసక్తికరంగా మారింది.
పింక్ చిత్రం షూటింగ్ ముగిసిన వెంటనే పవన్ ఈ సినిమాకు పూర్తిస్థాయిలో పని చేస్తారని చెబుతున్నారు. ఆ లోపు.. పవన్ లేని సన్నివేశాన్ని షూట్ చేస్తారని చెబుతున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రగ్యాజైస్వాల్ నటిస్తుందని చెబుతున్నారు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతి బరిలో ఉంటుందని చెబుతున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం పవన్ కు 27వ చిత్రం కాగా.. ఫిబ్రవరి నాలుగు నుంచి ఈ సినిమా షూటింగ్ షురూ అవుతుందని తెలుస్తోంది.