Begin typing your search above and press return to search.
పవన్ 27 మూవీ ఆ విషయంలో గందరగోళం
By: Tupaki Desk | 26 April 2020 9:28 AM GMTఅంతా బాగుండి.. ఈ కరోనా లాక్ డౌన్ లేకుండా ఉండి ఉంటే వచ్చే నెలలో వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు. ఇప్పటికే పవన్ తదుపరి చిత్రం క్రిష్ దర్శకత్వంలో షూటింగ్ శరవేగంగా జరుగుతూనే ఉండేది. కాని పవన్ ఫ్యాన్స్ ఆశలు అన్నీ తలకిందులు అయ్యాయి. ఈ ఏడాదిలో ఖచ్చితంగా రెండు సినిమాలు వస్తాయని ఆశించిన ఫ్యాన్స్ కు కనీసం ఒక్క సినిమా అయినా వచ్చేనా అన్నట్లుగా పరిస్థితి ఉంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందాల్సిన పవన్ 27వ చిత్రం కోసం వచ్చే ఏడాది వేసవి వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు.
క్రిష్ ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీతో చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. మొదట కియారా అద్వానీ అన్నారు. కాని చివరకు జాక్వెలిన్ ను ఖరారు చేశారనే టాక్ వినిపించింది. కాని లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలు పెట్టినప్పటికి ఆమె డేట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో దర్శకుడు క్రిష్ ముందు జాగ్రత్తగా ఈ చిత్రం కోసం నివేదా పేతురాజ్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
ఈమద్య కాలంలో ఈ అమ్మడి పేరు తెగ వినిపిస్తుంది. ట్యాలెంటెడ్ హీరోయిన్ గా ఈ అమ్మడికి పేరు దక్కింది. అల వైకుంఠపురంలో చిన్న పాత్రను చేసిన ఈ అమ్మడు త్వరలోనే క్రిష్ కు జోడీగా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. సినిమాకు సంబంధించి హీరోయిన్ విషయంలో మొదటి నుండి కూడా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్లీ జాక్వెలిన్ కాదు నివేదా అంటూ ప్రచారం జరుగుతూ ఫ్యాన్స్ లో గందరగోళం క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు. అందుకే దర్శకుడు క్రిష్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చి అందరి అనుమానాలు తీర్చాలంటూ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.