Begin typing your search above and press return to search.
2016: సూపర్ స్టార్.. పవర్ స్టార్.. దిమ్మదిరిగింది
By: Tupaki Desk | 31 Dec 2016 1:30 AM GMTటాలీవుడ్ కు 2016 ఎన్నో మధుర విజయాలనందించింది. ఈ ఏడాది తెలుగు సినిమాల సక్సెస్ రేట్ కూడా బాగా పెరిగింది. ఆ రకంగా టాలీవుడ్ ఈ ఏడాదిని అంత సులువుగా మరిచిపోలేదు. ఐతే టాలీవుడ్లో బిగ్గెస్ట్ స్టార్లయిన మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్ లకు మాత్రం ఈ ఏడాది దారుణమైన అనుభవాల్ని మిగిల్చింది. ఈ ఇద్దరు హీరో అభిమానులకు 2016 మరిచిపోవాల్సిన ఏడాది. కానీ అంత సులువగా మరిచిపోలేరు.
బ్రహ్మోత్సవం.. మహేష్ బాబు కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని చేదు జ్నాపకం ఇది. ఏ హీరోకైనా ఫ్లాపులు సహజమే కానీ.. ‘బ్రహ్మోత్సవం’తో తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకోవాల్సి వచ్చింది మహేష్. ఈ సినిమా చూసి.. తిట్టుకోని ప్రేక్షకుడు లేడు. మహేష్ జడ్జిమెంట్ స్కిల్స్‌ను ప్రశ్నార్థకం చేసిందీ సినిమా. పెట్టుబడిలో సగం కూడా వెనక్కి తేలేదీ సినిమా. దీన్ని కేవలం డిజాస్టర్ అనలేం.. డిజాస్టర్ కా బాప్ అనాలేమో. ఫస్ట్ వీకెండ్లోనే.. ఆ మాటకొస్తే ఫస్ట్ డే సాయంత్రానికే థియేటర్లు వెలవెలబోయేలా చేసిన సినిమా ఇది.
‘బ్రహ్మోత్సవం’తో పోలిస్తే బెటరే కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కూడా ఓ చేదు జ్నాపకమే. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్ సోలో హీరోగా వచ్చిన ఈ చిత్రం అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. వంద కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం కూడా అందులో సగం మాత్రమే వెనక్కి తెచ్చింది. పవన్ అన్నీ తానై వ్యవహరించిన ఈ సినిమా అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. అభిమానుల కోసం అంటూ పవన్ చేసిన ఆ సినిమా వాళ్లను కూడా ఆకట్టుకోలేదు. మొత్తానికి 2016 టాలీవుడ్ కు ఎంత గొప్ప విజయాలనందించినా.. నెంబర్ వన్ స్థానానికి పోటీ దారులైన పవర్ స్టార్.. సూపర్ స్టార్లకు మాత్రం దారుణమైన ఫలితాల్నే ఇచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/