Begin typing your search above and press return to search.
పవన్ తో రవితేజ కలిసిపోయాడు
By: Tupaki Desk | 23 Oct 2017 8:40 AM GMTరవితేజ అంటే మాస్ రాజా కాదులెండి. ఈయన పవన్ తో ఒకప్పుడు సన్నిహితంగా మెలిగిన రాజు రవితేజ. పవన్ ‘జనసేన’ పార్టీ పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు రాజు రవితేజ. అతడితో కలిసి పవన్ ‘ఇజం’ అనే పుస్తకం కూడా రాసిన సంగతి గుర్తుండే ఉంటుంది. జనసేన పార్టీ పెట్టిన సమయంలో పవన్ అతడికి చాలా ప్రాధాన్యమిచ్చాడు. ఎప్పుడూ పవన్ పక్కనే కనిపించేవాడు రాజు రవితేజ. ఐతే ఏమైందో ఏమో అతను సడెన్ గా అదృశ్యమయ్యాడు. వార్తల్లో లేకుండా పోయాడు. అతడికి.. పవన్ కు విభేదాల వచ్చినట్లుగా వార్తలొచ్చాయి. అందరూ రవితేజను మరిచిపోయిన సమయంలో ఇప్పుడు ఉన్నట్లుండి వార్తల్లోకొచ్చాడతను.
రాజు రవితేజ మళ్లీ పవన్ కు దగ్గరైనట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల దిశగా జనసేనను సిద్ధం చేయడంపై సీరియస్ గా దృష్టిపెట్టిన పవన్.. రవితేజను మళ్లీ దగ్గరికి తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణానికి సంబంధించి అతడికి కీలక బాధ్యతలు కూడా అప్పగించినట్లు తెలుస్తోంది. రవితేజ కొంత కాలం కిందటే పవన్ చెంతకు చేరినప్పటికీ ఆ విషయం బయటికి రాలేదు. తాజాగా జనసేన పార్టీ వెబ్ సైట్లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో రవితేజ పవన్ పక్కనే ఉండటం గుర్తించారు. ఆ తర్వాత ఆరా తీస్తే అసలు సంగతి బయటికొచ్చింది. రవితేజ-పవన్ కలిసి రాసిన ‘ఇజం’ పుస్తకం విమర్శల పాలైంది. అందులో ఏ విషయమూ స్పష్టంగా లేకపోవడంతో దాన్ని చదివిన వాళ్లు అసహనానికి గురయ్యారు. ఆ సంగతలా వదిలేస్తే ఇప్పుడు జనసేన పార్టీలో రవితజ ఎలాంటి పాత్ర పోషిస్తాడో చూద్దాం.