Begin typing your search above and press return to search.
`భీమ్లానాయక్` ట్రైలర్ : వైల్డ్ ఎనిమల్ కి ఖాకీ డ్రెస్ తో కళ్లెంవేశారా?
By: Tupaki Desk | 21 Feb 2022 3:40 PM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడేళ్ల విరామం తరువాత చేసిన చిత్రం `వకీల్ సాబ్`. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి పవన్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీ తరువాత పవన్ చేస్తున్న మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ `భీమ్లా నాయక్`. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా ఈ మూవీకి రచనా సహకారం కూడా అందించారు.
`అప్పట్లో ఒకడుండేవాడు` ఫేమ్ సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై యంగ్ ప్రోడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. రానా కీలక పాత్రలో పవన్ కు పోటాపోటీగా నటించిన ఈ చిత్రంలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ఫిబ్రవరి 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఈ సోమవారం గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇందు కోసం ఛీఫ్ గెస్ట్ గా గులాబీ నేత, మంత్రి కేటీఆర్ ని, ప్రత్యేక అతిథిగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ని ఆహ్వానించారు కూడా.
అయితే ఈ రోజు ఏపీ ఐటీ. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందడంతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈ వెంట్ ని వాయిదా వేశారు. అయితే ఇదే రోజు ట్రైలర్ ని యదావిధిగా రిలీజ్ చేశారు. రాత్రి 8:10 నిమిషాలకు కాకుండా గంట ఆలస్యంగా `భీమ్లా నాయక్` ట్రైలర్ ని రిలీజ్ చేశారు. టీజర్ లో `అరేయ్ డానీ.. బయటకి రానా నా కొడక్కా .. ` అంటూ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ లు నెట్టింట వైరల్ గా మారి టీజర్ సంచలనం సృష్టించింది. ఇక ట్రైలర్ ఏస్థాయిలో వుంటుందా? అని అభిమానులతో పాటు సినీ లవర్స్ గత కొన్ని రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వారి ఎదురుచూపులకు తెరదించుతూ 21 రాత్రి 8:10 గంటలకు ట్రైలర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ టెక్నికల్ సమస్యల కారణంగా గంట ఆలస్యంగా రిలీజ్ చేశారు. `భీమ్లానాయక్` ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట రచ్చ లేపుతోంది. ట్రైలర్ చూస్తుంటే థియేటర్లలో అభిమానుల పూనకాలు మాములుగా వుండేలా కనిపించడం లేదు. ఈలలు.. కేరింతలతో ఫ్యాన్స్ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. `ఏంటీ బాలాజీ స్పీడు పెంచావ్ `అంటూ రానా వాయిస్ తో ట్రైలర్ మొదలైంది. కటిక చీకట్లో దట్టమైన అడవిలో ఓ కార్ వెళుతూ వుండగా రానా వాయిస్ తో ట్రైలర్ మొదలైంది.
రానా డైలాగ్ కు `ఇదీ పులులు తిరిగే ప్రాంతమట బాబూ అని కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అనడం... `పులి పెగ్గేసుకుని పడుకుంది గనీ నువ్వు స్లోగానే పోనియ్ అంటూ రానా మళ్లీ కౌంటర్ గా చెప్పడం... డానియల్ శేఖర్ అంటూ ఓ వాయిస్ వినిపించగానే రానా సీరియస్ లుక్ లో నడుస్తున్న తీరు.. ఆ వెంటనే పోలీస్ డ్రెస్ లో బుల్లెట్ పై సర్రుమని ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ..సర్ హద్ భీమ్లా నాయక్.. సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీశైలం తాసిల్ అంకేశ్వరం మండలం ఆంధ్ర ప్రదేశ్ అంటూ తుపాకీ తూటాలు పేల్చడం.. ఆ తరువాత చెడ్డీపై రానాని అరెస్ట్ చేసి జీప్ బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి తీసుకెళ్లడం.. స్టేషన్ లో పవన్ ముందు కాలుపై కాలు వేసుకుని ఠీవీగా కూర్చుని రానా సవాలు చేస్తున్న తీరు... పవన్ యాటిట్యూడ్ కి రానా లేచి కుర్చీని తన్నడం...
ఎవరిని అరెస్ట్ చేశావో తెలుస్తోందా? నీకు అని రానా అరుస్తుంటే పవన్ సైలెంట్ గా వెళ్లి లాక్ పగలగొట్టి గన్ లోడ్ చేసి రెడీ అంటూ రానా ముందు నిలబడటం.. డ్యూటి అండ్ పవర్ మధ్య సాగే అల్టిమేట్ బాటిల్ గా కనిపిస్తోంది. అందుకే ట్రైలర్ లో అల్టిమేట్ బాటిల్ ఆఫ్ డ్యూటి అండ్ పవర్ అని వేశారు. ఒంటిమీద యూనిఫామ్ చూసుకుని పొగర్రా.. అని రావు రమేష్ అంటుంటే యస్.. అంటూ పవన్ సైగ చేయడం.. లాఠీ పట్టుకున్న పవన్ విలన్ బ్యాచ్ పై వీరంగం వేస్తున్న తీరు... రానా కళ్ల ముందే కార్ ని బ్లాస్ట్ చేసి భయపెట్టిన విధానం... `ఏం నాయక్ నువ్వు పేల్చినప్పుడు వాడు లోపల లేడా చూస్కోవాలి కదా.. అని నిత్యామీనన్ అంటుంటే .. మురళీ శర్మ `గొప్పదానివి దొరికావమ్మా` అనడం.. పవన్ , నిత్యామీనన్ మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలు..
`ఇల్లుని చూస్కోవడానికి ఒక మగాడు కావాలి.. వాడి అడ్రస్ మిస్సయింది.. వెళ్లి తీసుకురాపో.. అంటూ సముద్రఖని .. రానాతో అనడం..ఆ మాటలకు రానా అవమానంతో రగిలిపోతున్న తీరు... స్టేషన్ లో పంచూడదీసి రానాని పవన్ చెడుగుడు ఆడిన విధానం... అవమానం తట్టుకోలేక పవన్ పై రానా తిరుగుబాటు చేస్తున్న సన్నివేశాలు.. `కిలోమీటర్ ఊరు సార్... దాటితే మొత్తం అడివే.. పాయింట్ బ్లాంక్ లో కాల్చి తుప్పల్లో పడదొబ్బితే పదిరోజులు పడుతుంది శవం దొరకడానికి ` అంటూ పవన్ చెబుతున్న డైలాగ్ లు.. గన్ తో సముద్ర ఖని ఇంట్లో పవన్ చేస్తున్న హల్ చల్...`తొల్ తీస్తానాకొడకా.. `అని పవన్ చిందులు .. `ఒక వైల్డ్ ఎనిమల్ కి కళ్లెంవేసినట్టు ఒక ఎక్స్‌స్ట్రీమ్ కి యూనిఫామ్ వేసి వాణ్ణి కంట్రోల్ లో పెట్టాం. నువ్వు ఆ యూనిఫామ్ తీసేశావ్..`అని మురళీ శర్మ ట్రైలర్ ఎండ్ లో చెప్పిన డైలాగ్ లు `భీమ్లా నాయక్` ఏ రేంజ్ లో వుండబోతోందో.. పవన్ క్యారెక్టర్ ని ఏ రేంజ్ లో డిజైన్ చేశారో స్పష్టమవుతోంది.
ఊరమాస్ క్యారెక్టర్ లో పవన్ నటించిన ఈ మూవీ ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ ఎక్స్‌స్ట్రీమ్ లెవెల్లో పూనకాలతో ఊగిపోతున్నారు. `గబ్బర్ సింగ్` తరువాత అంతకు మించి అనే స్థాయిలో పవన్ భీమ్లానాయక్ పాత్రలో విశ్వరూపం చూపించినట్టుగా తెలుస్తోంది. ట్రైలర్ తో సెలబ్రేషన్స్ కి తెరలేపిన ఈ మూవీ థియేటర్లలో రికార్డు స్థాయిలో సంచనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.