Begin typing your search above and press return to search.

పవన్‌ కంటే రానా ఏమాత్రం తక్కువ కాదట!

By:  Tupaki Desk   |   10 March 2021 10:30 AM GMT
పవన్‌ కంటే రానా ఏమాత్రం తక్కువ కాదట!
X
మలయాళ సూపర్ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ లో పవన్‌ మరియు రానా లు కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఒరిజినల్‌ వర్షన్‌ లో ఇద్దరు హీరోలకు సమానమైన ప్రాముఖ్యత ఉంటుంది. కాని తెలుగుకు వచ్చేప్పటికి పవన్‌ సూపర్‌ స్టార్‌ కనుక ఆయన పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి రానా పాత్రకు ప్రాముఖ్యత తగ్గించే అవకాశం ఉందంటూ కొందరు భావించారు. కాని చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రీమేక్ లో పవన్ పాత్ర కంటే రానా పాత్ర ఏమాత్రం తక్కువ కాకుండా చూపించబోతున్నారట.

రానా లుక్‌ నుండి మొదలుకుని పాత్ర ప్రాముఖ్యత వరకు అన్ని విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారట. రానా పంచె కట్టులో అదిరి పోయేలా కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. పవన్‌ మరియు రానా కాంబో సీన్స్‌ విషయంలో కూడా ఎక్కడ పవన్‌ డామినేషన్‌ లేకుండా కథకు తగ్గట్లుగా ఒరిజినల్ వర్షన్‌ లో ఉన్న ఫీల్‌ మిస్ అవ్వకుండా సినిమా ను చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే రానా మరియు పవన్‌ ల కాంబో సీన్స్ చిత్రీకరణ జరిపారు. బాహుబలి తర్వాత రానా చేస్తున్న అతి పెద్ద మల్టీ స్టారర్‌ ఇదే. ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్‌ స్క్రీన్‌ ప్లే అందిస్తున్నాడు. ఇదే ఏడాదిలో ఈ రీమేక్ ను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ విషయమై త్వరలో స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.