Begin typing your search above and press return to search.

మ‌హేష్ బాబు 29.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ 6

By:  Tupaki Desk   |   23 July 2016 5:30 PM GMT
మ‌హేష్ బాబు 29.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ 6
X
ఏంటీ నంబ‌ర్లుఅనుకుంటున్నారా..? ఈ ఇద్ద‌రూ త‌మ కొత్త సినిమాల్ని మొద‌లుపెట్ట‌బోయే తేదీల‌న్న‌మాట‌. త‌మ గ‌త సినిమాల‌తో గ‌ట్టి ఎదురు దెబ్బ‌లు తిన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మ‌హేష్ బాబు.. త‌మ త‌ర్వాతి సినిమాల్ని మొద‌లుపెట్ట‌డంలో బాగా ఆల‌స్యం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఆ సినిమాలు సెట్స్ మీదికి మాత్రం వెళ్ల‌ట్లేదు. ఐతే ఎట్ట‌కేల‌కు వీళ్లిద్ద‌రికీ ముహూర్తం కుదిరింది.

మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ చేయ‌బోయే సినిమా జులై 29న సెట్స్ మీదికి వెళ్తుంది. చెన్నై - ముంబ‌యి - గుజ‌రాత్‌ - పుణె - హైద‌రాబాద్‌ ల్లో షెడ్యూళ్లు ప్లాన్ చేశార‌ట‌. నిర్విరామంగా షూటింగ్ జ‌రుగుతుంద‌ట‌.తమ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా - ఎస్.జె.సూర్య విలన్‌ గా న‌టించబోతున్న సంగతి తెలిసిందే. స్వయంగా సూర్యనే ఓ ఇంటర్వ్యూలో ఈ సంగతి వెల్లడించాడు. ఎన్వీ ప్రసాద్.. ఠాగూర్ మధు నిర్మించే ఈ చిత్రం ఈ నెలాఖరులోనే సెట్స్ మీదికి వెళ్తుంది. దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలన్నది ప్లాన్.

ఇక ప‌వ‌న్ సినిమా సంగ‌తికొస్తే ఆగ‌స్టులో షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని శ‌ర‌త్ మ‌రార్ ఆల్రెడీ ప్ర‌క‌టించాడు. శ్రుతి హాస‌న్ హీరోయిన్ అని కూడా క‌న్ఫ‌మ్ చేశాడు. ఆగ‌స్టు 6న రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. గోపాల గోపాల త‌ర్వాత మ‌రోసారి ప‌వ‌న్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు డాలీ. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తాడు.