Begin typing your search above and press return to search.

నవంబర్ లోనే పవన్ ఎటాక్‌??

By:  Tupaki Desk   |   17 Jun 2016 4:40 AM GMT
నవంబర్ లోనే పవన్ ఎటాక్‌??
X
ఏంటో సడన్‌ గా రూటు మారుస్తున్నాడు.. గేర్లు వేస్తున్నాడు.. పంథా మార్చుకుని కొత్త పద్దతులు ఫాలో అవుతున్నాడు. అదేనండీ బాబూ.. మొన్న సమ్మర్ లోనేగా సర్దార్‌ సినిమా వచ్చింది.. అప్పుడే మళ్ళీ కొత్త సినిమా ఏంటి అనుకుంటున్నారా?? కనీసం ఓ ఏడాది నుండి రెండు మూడేళ్ళు గ్యాప్‌ లేకుండా ఏంటమ్మా తొందర అనుకుంటున్నారా?? అందరికీ ఇప్పుడు పవర్ స్టార్ కొత్త పంచ్ ఇస్తున్నాడు మరి.

ఆల్రెడీ ఫారిన్‌ టూర్‌ నుండి ఇండియా వచ్చేసిన పవన్‌ కళ్యాణ్‌.. పనిలో పడిపోయాడట. ఇప్పటికే సినిమా కథ అంతా ఫైనల్‌ అయిపోయింది కాబట్టి.. ఒక్కసారి డైలాగుల మీద కూర్చొని ఏదో సానబడుతున్నారట. ఎస్.జె సూర్య డైరక్షన్ లో రూపొందుతున్న తన తదుపరి సినిమా కోసం ఆకుల శివ మాటలు సమకూరుస్తున్నాడు. అయితే ఈ సినిమాను వెనువెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లి.. ఏకంగా నవంబర్ నెలలో రిలీజ్‌ కూడా చేసేయాలని పవన్‌ కళ్యాన్‌ ప్లాన్ చేస్తున్నాడట.

మరి 2019లో పాలిటిక్స్ లో చక్రం తిప్పడానికి బరిలో దిగాలి కాబట్టే ఇప్పుడు ఇంత స్పీడుగా సినిమాలు చేస్తున్నాడా.. లేకపోతే ఏదైనా డబ్బులు అవసరముండే ఇంత త్వరత్వరగా సినిమా చేసేస్తున్నాడా అనే విషయం తెలియదు కాని.. మనోడు మాత్రం దంచేస్తున్నాడంతే.