Begin typing your search above and press return to search.

నితిన్ 'పెళ్లి కొడుకు ఫంక్షన్'కి హాజరైన పవన్ కళ్యాణ్...!

By:  Tupaki Desk   |   24 July 2020 2:30 PM GMT
నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్కి హాజరైన పవన్ కళ్యాణ్...!
X
టాలీవుడ్ యువ హీరో నితిన్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. తాను ప్రేమించిన షాలిని కందుకూరిని నితిన్ హైదరాబాద్ లోనే ఈ జూలై 26న వివాహం చేసుకోనున్నాడు. ఇప్పటికే ఈ వివాహానికి పలువురు రాజకీయ నాయకులను మరియు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో పాటు కొందరు సన్నిహితులను నితిన్ ఆహ్వానించాడు. ఇటీవల హైద‌రాబాద్‌ లో నితిన్ - షాలినిల కుటుంబ పెద్ద‌లు తాంబూళాలు మార్చుకుని నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు.

ఈ క్రమంలో నేడు నితిన్ పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం జరిపించారు. ఈ ఫంక్షన్ కి నితిన్ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు. వీరితో పాటు ప్రొడ్యూసర్ రాధాకృష్ణ (చిన బాబు) కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాతార్మాస్య దీక్షలో ఉండి కూడా నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్ కి వచ్చి తన ఆశీస్సులు తెలియజేసారు. పెళ్లి కొడుకుగా ముస్తాబైన నితిన్ ఫోటోలు బయటకి వచ్చాయి.

కాగా తెలంగాణ ప్రభుత్వం సూచించిన గైడ్ లైన్స్ ని అనుసరించి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని వివాహం జరిపించడానికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26న రాత్రి 8:30 నిమిషాల‌కు నితిన్- షాలిని వివాహం జ‌ర‌గ‌నుంది. ప్రస్తుతం నెలకొనియున్న పరిస్థితుల వల్ల నిభందనలు అనుసరించి నితిన్ - షాలిని వివాహ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది స్నేహితులు అతిథుల సమక్షంలో వివాహ వేడుక నిర్వహించనున్నారు.