Begin typing your search above and press return to search.

పంద్రగాస్టుకు పవన్ వస్తున్నాడట..

By:  Tupaki Desk   |   4 Aug 2017 11:27 AM GMT
పంద్రగాస్టుకు పవన్ వస్తున్నాడట..
X
ఈ ఏడాది వేసవి ఆరంభంలో మూడు భారీ తెలుగు సినిమాలు సెట్స్ మీదికి వెళ్లాయి. అందులో ఒకటైన ‘పైసా వసూల్’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు కూడా సిద్ధమైపోయింది. ఇప్పటికే ఫస్ట్ లుక్.. స్టంపర్ రిలీజయ్యాయి. త్వరలోనే ఆడియో ఆవిష్కరణ కూడా జరగబోతోంది. ఇక రెండో సినిమా ‘జై లవకుశ’కు సంబంధించి లోగో.. ఫస్ట్ లుక్స్.. ఒక టీజర్ కూడా వచ్చాయి. ఇంకో రెండు టీజర్ల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఈ సినిమాలతో పాటే సెట్స్ మీదికి వెళ్లిన పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి మాత్రం ఇప్పటిదాకా ఏ విశేషం పంచుకోలేదు. దీని టైటిల్ కూడా ఇప్పటిదాకా ప్రకటించలేదు. ఫస్ట్ లుక్ కూడా రాలేదు. దీంతో పవన్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఐతే త్వరలోనే పవర్ స్టార్ ఫ్యాన్స్ ను మురిపించబోతున్నట్లు సమాచారం. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా పవన్-త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేస్తారట. అప్పుడే టైటిల్ కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ చిత్రానికి ఇంజినీర్ బాబు అని.. గోపాల కృష్ణుడు అని.. పరదేశ ప్రయాణం అని.. ఇలా రకరకాల టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ పేర్లతో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా బయటికి వచ్చాయి. మరి వీటిలో ఏదైనా ఒక టైటిల్ ను త్రివిక్రమ్ ఫైనలైజ్ చేస్తాడా.. లేక కొత్త టైటిల్ ఎంచుకుంటాడా అన్నది చూడాలి. ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్.. అను ఇమ్మాన్యుయెల్ నటిస్తున్నారు.