Begin typing your search above and press return to search.
ఇకనైనా అజ్ఞాతం వీడుతారా??
By: Tupaki Desk | 11 Jan 2018 5:36 AM GMTకొత్త సంవత్సరంలో రిలీజైన మొదటి భారీ బడ్జెట్ చిత్రం అజ్ఞాతవాసి. అత్తారింటికి దారేది సినిమాతో టాలీవుడ్ కూడా రూ. 100 కోట్ల వసూళ్ల ఫీట్ సాధించగలదని నమ్మకం కలిగించిన హీరో పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే సినిమా ప్రీ బిజినెస్ కూడా జరిగింది. దాదాపు రూ. 125 కోట్ల మొత్తం ఇండస్ట్రీ ఈ సినిమాపై ఇన్వెస్ట్ చేసింది.
ఇన్ని అంచనాల మధ్య వచ్చిన అజ్ఞాతవాసి మొదటి రోజునే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ ట్రెండును బట్టి చూస్తే ఈ సినిమా టార్గెట్ చేరుకోవడం చాలా కష్టం. మరోవైపు హీరో పవన్ కళ్యాణ్ కానీ.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గానీ ఈ సినిమా ప్రమోషన్ పై అస్సలు దృష్టి పెట్టలేదు. ప్రమోషన్ భారమంతా ఫ్యాన్స్ పై పడేసి సినిమా రిలీజుకు ముందునుంచే సైలెంట్ గా ఉండిపోయారు. తీరా ఇప్పుడేమో సినిమా ఏమో తేడా కొట్టేసింది. కాస్తలో కాస్త మేలు ఏంటంటే ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో వచ్చింది. వీకెండ్ తరవాత మూడు రోజుల పాటు పండగ సెలవులు ఉన్నాయి. సినిమాను టీవీ ప్రింట్ మీడియాల్లో కాస్త ప్రమోట్ చేయడం మొదలు పెడితే పండగ పూర్తయ్యే వరకు కలెక్షన్లు మరీ డ్రాపవకుండా నిలకడగా కొనసాగే అవకాశం ఉంది.
అజ్ఞాతవాసి సినిమాకు వచ్చిన హైప్ తో డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలు చెల్లించి ఈ మూవీని కొనుగోలు చేశారు. నెమ్మదిగా మౌత్ టాక్ తో పుంజుకుంటుందని ఆశ పెట్టుకుని ఎదురుచూస్తూ కూర్చుంటే అజ్ఞాతవాసి రూ. 125 కోట్ల కలెక్షన్ల రాబట్టడం అనేది కలలోని మాట. ఇప్పటికైనా సినిమా యూనిట్ ప్రమోషన్ మొదలుపెడితే నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉందనేది డిస్ట్రిబ్యూటర్ల ఆశ. మరి ఆప్తమిత్రులైన త్రివిక్రమ్- పవన్ లు ఈ యాంగిల్ ఆలోచిస్తారా అనేది ప్రశ్న.