Begin typing your search above and press return to search.
తొందరపడి కోయిలలు ముందే కూశాయి
By: Tupaki Desk | 16 Aug 2015 10:01 AM GMTఆగష్టు 22.. మెగా-డే. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆరోజు కోసం అభిమానులు వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. చిరు పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం భారీ వేదికను హైదరాబాద్ లో సిద్ధం చేస్తున్నారు. ఈ వేదిక ఎన్నో సర్ ప్రైజ్ లు ఇస్తుందని అంతా అనుకున్నారు.
పవన్ కళ్యాణ్- బాబి సినిమా ఫస్ట్ లుక్, చరణ్-వైట్ల సినిమా ఫస్ట్ లుక్, టీజర్, బన్ని-బోయపాటి సినిమా లుక్, ట్రైలర్, వరుణ్ తేజ్ -క్రిష్ 'కంచె' ఫస్ట్ లుక్, టీజర్, అల్లు శిరీష్ సినిమా ఓపెనింగ్, సాయిధరమ్ తేజ్ -హరీష్ శంకర్ కలయికలోని 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' ట్రైలర్ .. ఇలా ప్రతిదీ ఈ వేదిక పైనే ప్లాన్ చేస్తున్నారని అప్పట్లో అనుకున్నారు. అయితే తొందరపడి కొన్ని కోయిలలు ముందే కూశాయి అన్న చందంగా పవన్, వరుణ్ తేజ్ కాస్త తొందరపడ్డారనే అనిపిస్తోంది. కంచె ఫస్ట్ లుక్, సర్ధార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ లుక్ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా మెగాభిమానుల ముందుకు వచ్చేశాయి. ఇది ఊహించనిది. మెగా-డే వరకూ ఆగుతారనే అనుకున్నారంతా. అయితే ఈ ఇద్దరూ ముందే వచ్చేశారు. సర్ ప్రైజ్ ఇచ్చారు. వై? ఎందుకలా?
దేశభక్తి అన్న కాన్సెప్టు ఉన్న సినిమాలు కావడం వల్లే ఇలా చేశారా? అన్న సందేహం అభిమానుల్లో కలిగింది. ఒకవేళ ఇప్పుడు వచ్చేసినా, అప్పటికి వేరొక ప్లాన్ తయారు చేస్తున్నారేమో! మెగాస్టార్ పుట్టినరోజున మెగా ఫ్యామిలీ అంతా ఒకే వేదికపైకి రానుందన్న ఊహాగానాలు స్కై లో ఉన్నాయిప్పుడు. ఏం చేస్తారో వెయిట్ అండ్ సీ.