Begin typing your search above and press return to search.
పార్టీలో పవన్ ఏం చేశాడంటే...?!
By: Tupaki Desk | 23 Aug 2015 4:13 AM GMTరెండు మూడేళ్లుగా మెగా కుటుంబానికి సంబంధించి ఎక్కడ ఏ వేడుక జరిగినా ఒక్కటే నినాదం. పవర్ స్టార్.. పవర్ స్టార్. వేదిక పై ఎవరేం మాట్లాడుతున్నా ఏమీ పట్టించుకొనేవాళ్లు కాదు అభిమానులు. ఆఖరికి చిరంజీవి మాట్లాడుతున్నా సరే... పవర్ స్టార్ అన్న నినాదాలే వినిపించేవి. కొన్నేళ్లుగా మెగా వేడుకలకి పవన్ దూరంగా ఉండడమే అందుకు కారణం. కుటుంబంలో బేధాభిప్రాయాలు ఉన్నాయని, అందుకే పవన్ వేడుకలకు హాజరు కావడం లేదనీ, ఆయన్ని మళ్లీ మెగా కుటుంబంతో కలిపి చూడాలని అభిమానులు చెప్పేవారు. పవన్ మాత్రం వేడుకకి ఎంతకీ వచ్చేవాడు కాదు. అయితే నిన్న జరిగిన అన్నయ్య చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకల్లో మాత్రం పవన్ పాల్గొన్నారు. మధ్యాహ్నమే చిరు ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పొచ్చాడు పవన్. ఆ తర్వాత పార్క్ హయత్ లో జరిగిన పార్టీకి కూడా హాజరయ్యాడు.
తన మిత్రులు త్రివిక్రమ్, శరత్ మరార్ తో కలిసి పవన్ కళ్యాణ్ మెగా వేడుకకి హాజరయ్యాడు. స్వయంగా కారును డ్రైవ్ చేసుకొంటూ ఆయన వేడుకకి వచ్చాడట. పార్టీలోకి ఎంట్రీ కాగానే నేరుగా అన్నయ్య, వదినల దగ్గరికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పాడట. పవన్ కనిపించగానే.. `మా హీరో వచ్చాడు` అంటూ చిరంజీవి ఆత్మీయంగా దగ్గరకి తీసుకొన్నాడట. ఆ తర్వాత పార్టీకి హాజరైన ప్రముఖులందరి దగ్గరికి వెళ్లి పవన్ పలకరించాడట. దాదాపుగా పార్టీ పూర్తయ్యేవరకు పవన్ అక్కడే గడిపాడట. కుటుంబ సభ్యులతోనూ, అతిథులతోనూ పవన్ కళ్యాణ్ కలిసిపోయిన విధానం చూసి చిరంజీవి చాలా ఆనందపడ్డారట. మొత్తంగా అటు అభిమానులు, ఇటు సినీ ప్రముఖులు, కుటుంబసభ్యులు కలిసి చిరంజీవి 60వ పుట్టినరోజుని ఒక మెమరబుల్ డేని చేశారు. చిరు, పవన్ కలిసిన ఫొటోల్ని చూసుకొని అభిమానులు ముచ్చటపడిపోతున్నారు.