Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: వదినమ్మతో పవర్ స్టార్
By: Tupaki Desk | 12 Feb 2019 4:06 AM GMTజనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ వైపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే ఫంక్షన్ లకు - వెడ్డింగ్ లకు హాజరవుతున్నారు. ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్రవేయాలని ప్రయత్నిస్తున్న పవన్ కల్యాణ్ ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఇప్పటికే పార్లమెంటరీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కమిటీలను నియమించి మాంచి జోరుమీదున్నారు. ఇలా రాజకీయ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న జనసేనాని పవన్ ఇటీవల హైదరాబాద్ లో ఓ వివాహ వేడుకకు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తను ఒంటరిగా ఈ వేడుకకు రాలేదు. తన తల్లిగా భావించే వదినమ్మ సురేఖతో కలిసి రావడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. చాలా సందర్భాల్లో అన్నయ్య చిరంజీవి - వదిన సురేఖ నాకు తల్లిదండ్రులని పవన్ కల్యాణ్ చెప్పిన విషయం అందరికి విదితమే. సందర్భం ఏదైనా అన్నా- వదినలను పవన్ ఎంతగానో గౌరవిస్తుంటారు. రాజకీయంగా ప్రత్యర్థులు ఎన్ని కామెంట్లు చేసినా అన్నిటినీ తిప్పి కొడుతూ అన్నయ్య తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని పవన్ పలుమార్లు తెలియజెప్పే ప్రయత్నం చేశారు.
ఆదివారం నాడు సీవీఆర్ గ్రూప్ సంస్థల అధినేత కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకకు వదిన సురేఖతో కలిసి పవన్ కల్యాణ్ హాజరు కావడం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. చిన్న పిల్లాడి చేయిపట్టుకుని వేడుకకు తీసుకొస్తున్నట్లుగా సురేఖ గారు మరిది పవన్ చేయిపట్టుకుని వివాహ వేడుకకు రావడం చూపరులను ఆకర్షించింది. చుట్టూ భారీ జనం మధ్య వదినకు పవన్ గార్డ్ గా వ్యవహరించిన తీరుకు అంతా ఫిదా అయిపోయారు. తన లైఫ్ లో కీలకమైన దశలో వదినమ్మ సూచనలు - సలహాలు తీసుకుని ఇంతటివాడినయ్యానని పవన్ ఎంతో గర్వంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.